Telugu News

బచ్చోడులో కరెంట్ కోసం రైతులు ధర్నా

పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన

0

బచ్చోడులో కరెంట్ కోసం రైతులు ధర్నా

== పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది‌‌.. పంటలు పొట్ట దశకు వచ్చిన సమయంలో విద్యుత్ సరఫరాలో కోతలు కారణంగా రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో కోతలు విధించడంతో తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేశారు.

ఇది కూడా చదవండి:+;లింగారంతండా హైవే కనెక్టివిటీ రోడ్డు మరుమ్మత్తులు

బచ్చోడు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సకాలంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరెంట్ రాకపోవడం వల్ల చేతికందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులతో ఎన్ని సార్లు మొత్తుకున్నా వినలేదని, పై అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాలో కోతలు లేకుండా చూడాలని, సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఇబ్బంది లేకుండా చూస్తామని హామినిచ్చారు.