Telugu News

రైతులు ఆదైర్యపడోద్దు..? ప్రతి గింజను కొంటాం: మంత్రి

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

0

రైతులు ఆదైర్యపడోద్దు..? ప్రతి గింజను కొంటాం: మంత్రి

== మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

ఖమ్మం, మే 14(విజయంన్యూస్):

రైతులేవ్వరు ఆదైర్యపడోద్దని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి, అల్లిపురం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం, ఖమ్మం కార్పొరేషన్ లోని అల్లిపురంలో ప్రభుత్వం మార్క్ ఫెడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ఆదివారం ప్రారంభించారు.

ఇది కూడ చదవండి: అంకిత భావానికి ప్రతీక హనుమాన్ జయంతి : మంత్రి

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జొన్నలు క్వింటాలుకు రూ.1962 కు చెల్లించి రైతుల వద్ద నుండి కొంటున్నామన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో రైతులకు ఉచితంగా కరెంట్ కూడా ఇవ్వాలనే పరిస్థితి ఉండేదని, కానీ నేడు రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకొలేనంత విస్తారంగా పంటలు పండుతున్నాయని అయన వివరించారు. గతంలో పొలాల్లో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఆ విషాద ఛాయలను పూర్తిగా పారదొలి వ్యవసాయంలో తెలంగాణ ను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఅర్ అని అన్నారు. ఇప్పటికే రైతు బందు పథకం ద్వారా రైతులకు ప్రతి ఎకరాకు ప్రతి ఏడాది రూ.10 వేలు ఇస్తున్నామని, ఈ పథకం ఐదు ఏళ్ళుగా అందిస్తూ విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. ఆర్వోఎఫ్ఆర్  పట్టాలు ఉన్న వారికి కూడా రైతు బందు ఇస్తున్నామని, నేడు తెలంగాణ వ్యవసాయ హబ్ గా నిలిచిందన్నారు. పిండి బస్తాలకు కొదువలేదని, గతంలో మంచుకొండ సొసైటీ ముందు ఎరువుల కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి, పోలీస్ చేతిలో లాఠీ దెబ్బలు కూడా తిన్న ఘటనలు లేకపోలేదన్నారు.

ఇది కూడా చదవండి: కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు..ఎప్పుడంటే..?

రైతులు పండించిన వడ్లు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తా మని ముఖ్యమంత్రి కేసీఅర్ గారు హామీ ఇచ్చారని, తడిచిన ధాన్యం కూడా కొంటామని స్పష్టం చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంకు రెండు హెలికాప్టర్ లలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు, ఉన్నతాదికారులు వచ్చి ఏకరానికి రూ.10వేలు నష్ట పరిహారం ప్రకటించిన విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ,ఏబీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ భీరెడ్డి నాగచంద్ర రెడ్డి,  రెవిన్యూ డివిజన్ అధికారి రవీంద్రనాథ్, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ సునిత, డి.సి..ఓ. విజయ కుమారి, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహశీల్దార్ నర్సింహరావు, వ్యవసాయ ఏ.డి.ఏ.శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోరెపల్లి శ్వేత, కార్పొరేటర్ రావూరి కరుణ సైదుబాబు, సర్పంచ్ మెంటెం రామారావు, నాయకులు మద్దినేని వెంకటరమణ, కుర్రా భాస్కర్ రావు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.