Telugu News

రైతులను నట్టేటా ముంచేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నల్ల చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం.

ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ క్యాన్ లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి సాధించిన విజయం దేశ చరిత్రలో కలకాలం నిలిచి ఉంటుంది.

0

రైతులను నట్టేటా ముంచేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నల్ల చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం.

( తెలంగాణ  – విజయం న్యూస్) :- 

ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ క్యాన్ లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి సాధించిన విజయం దేశ చరిత్రలో కలకాలం నిలిచి ఉంటుంది. సత్యాగ్రహం ద్వారా కేంద్రం అహంకారాన్ని ఓడించారు. అన్యాయానికి వ్యతిరేఖంగా రైతులు అంతిమ విజయం సాధించారు. అన్యాయానికి వ్యతిరేకంగా విజయం సాధించిన రైతులకు అభినందనలు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట సంకేతం… సాగు చట్టాల రద్దుకు ఒక కారణం. దక్షిణాది రాష్ట్రాలలో రైతు ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసి పడే ప్రమాదముందని గ్రహించిన కేంద్రం వెనక్కు తగ్గి రైతు నల్ల చట్టాలను రద్దు చేసింది. రైతుల పోరాటంలో కాంగ్రేసు పార్టీ పాత్ర శూన్యం.
ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. రైతుల పోరాటానికి ముందే కేంద్ర నిర్ణయం తీసుకుంటే బాగుండేంది. సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండించే మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, అదే విధంగా వచ్చే యాసంగిలో రాష్ట్రంలో వరి పండించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.-డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్సీ & చైర్మన్,తెలంగాణ.

 

also read :-గర్జించిన 24 గంటలలోపే..