Telugu News

రైతులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించాలి: మంత్రి తుమ్మల 

భూములు కోల్పోయిన రైతులు మంత్రి తుమ్మలకు వినతిపత్రం

0

రైతులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించాలి: మంత్రి తుమ్మల 
== భూములు కోల్పోయిన రైతులు మంత్రి తుమ్మలకు వినతిపత్రం

ఏన్కూరు మే 15(విజయం న్యూస్)
ఏన్కూరు మండలంలోని హిమంనగర్ నుండి ఏన్కూరు యన్ ఏస్ పి కాల్వ వరకు జరుగుతున్న సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ కాల్వ పనులను పరిశీలించడానికి ఏన్కురు వచ్చిన వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావునీ కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్ మంత్రితో మాట్లాడుతూ ఈ కాల్వ క్రింద భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా ఒక ఏకరనికి 30లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.ఈ కాల్వ క్రింద భూములు కోల్పోయిన రైతుల వివరాలు, ఎంత భూములు కోల్పోతున్నారు అనే వివరాలు ఇంకా అధికారులు ప్రకటించకుండా,పనులు జరగడం తో రైతుల్లో ఆందోళన నెలకొన్నదని మంత్రి తెలియజేశారు.స్పందించిన మంత్రి రైతులందరికీ న్యాయం చేస్తామని ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సీపీఐ జిల్లా సమితి సభ్యులు అమరనేని వీరభద్రమ్,సీనియర్ నాయకులు మేడ భూషయ్య, ఏఐటియుసి జిల్లా నాయకులు మంకెన కృష్ణ,రైతు నాయకులు తాళ్లూరి రమణ,భూములు కోల్పోతున్న రైతులు పాల్గన్నారు.