Telugu News

రైతులను సుభీక్షంగా చూడాలి: పొంగులేటి

జీళ్ళచెరువు మోకులగుంజ బజారులో అన్నదానంను ప్రారంభించిన పొంగులేటి, పువ్వాళ్ల, రాయల, మద్ది

0

రైతులను సుభీక్షంగా చూడాలి: పొంగులేటి

== జీళ్ళచెరువు మోకులగుంజ బజారులో అన్నదానంను ప్రారంభించిన పొంగులేటి, పువ్వాళ్ల, రాయల, మద్ది

== ప్రత్యేక పూజలు చేసి అర్థిక చేయూత

(కూసుమంచి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో, ఖమ్మం జిల్లాలో రైతులందరు సుభీక్షంగా ఉండాలని, పాడి పంటలు మెండుగా పండి రైతుల కంట్లో ఆనందం చూసే విధంగా దీవించాలని వినాయకుడికి మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలోని మోకుల గుంజ బజారులో వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, పీసీసీ అధికారప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. జీళ్ళచెరువు వచ్చిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోకులగుంజ బజార్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: ప్రజలందరు చల్లగా ఉండేలా దీవించండి గణేషా: పొంగులేటి

మోకులగుంజ బజార్, మందుల బజార్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మోకులగుంజ బజార్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగ పొంగులేటి మాట్లాడుతూ భవిష్యత్ ప్రజలదేనని, రాబోయే కాలంలో ప్రజల రాజ్యం రాబోతుందన్నారు. అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు విగ్రహాలకు ఒక్కోక్క విగ్రహానికి రూ.5016, రాయల నాగేశ్వరరావు రూ.5016 చొప్పున రెండు విగ్రహాలకు, మద్ది శ్రీనివాస్ రెడ్డి రూ.3016 చొప్పున రెండు విగ్రహాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మట్టెగురవయ్య, మాజీ సీడీసీ చైర్మన్ జూకూరి గోపాల్ రావు, మాజీ సర్పంచ్ మద్ది వీరారెడ్డి, పాలకుర్తి నాగేశ్వరరావు, నాయకులు పెండ్ర అంజయ్య, ప్రభాకర్,నాగిరెడ్డి రమేష్ రెడ్డి, రాంరెడ్డి, సుధాకర్ రెడ్డి, అంబాల వెంకన్న, రాంగోపాల్, గ్రామశాఖ అధ్యక్షుడు కత్తిశ్యామ్, నాగేశ్వరరావు, మద్దెల ఉపేందర్, నాగేశ్వరరావు, రామస్వామి, అనిల్, ప్రభాకర్, రమేష్, వార్డు సభ్యుడు రంగయ్య, తదితరులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి: రేపు జిల్లాకు తుమ్మల రాకా