Telugu News

వరంగల్ డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలి

== జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

0

వరంగల్ డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలి

== జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-

అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్‌ను అన్ని నియోజకవర్గ, మండల, బూత్ స్థాయిలలో విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నేరవేర్చిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక దమ్మున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. ప్రజా శ్రేయస్సుకు ఎన్ని అడ్డుంకులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడి ప్రజలకు మెరుగైన పాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు.

also read;-త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా..?

గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ప్రభుత్వాలు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయాయని, హామీలిచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారే తప్పా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే తరహా పంథాలో పాలన సాగిస్తున్నాయని ప్రజలను దోసుకో జేబు నింపుకో అన్న చందంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పి ఇంత వరకూ ఇచ్చిన హామీని నేరవేర్చలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో వస్తే ఏటా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఉన్న ప్రభుత్వ సంస్థలను అంబానీ అధానీలకు దోచిపెడుతోందని అన్నారు. రైతు అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ తో మరోసారి ప్రజల ముందుకు వస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్న తొమ్మిది అంశాలను కచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం.

also read;-యువత పోటీ పరీక్షలకు సిద్దంగా ఉండండి

కౌలు రైతుతో పాటు భూమి ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి ఎకరాకు రూ.15వేలను అందజేస్తామని, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్ట పరమైన అధికారులతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇంక వరంగల్ డిక్లరేషన్ పేర్కొన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు వరంగల్ డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు. – అంతేకాకుండా ఈ ఎనిమిది ఏండ్ల కాలంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ జావిద్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు వడ్డెబోయిన నర్సింహారావు, జిల్లా నాయకులు సయ్యద్ హుస్సెన్, శంకర్ నాయక్, చోటా బాబా తదితరులు పాల్గొన్నారు.