***రైతులను ఆదుకోవాలి: కిసాన్ కాంగ్రెస్
***(ఏన్కూరు-విజయంన్యూస్):-
తామర పురుగువల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు లచ్చగూడెంలొ జరిగిన మండల కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని తక్షణమే ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని .తామర పురుగు వల్ల నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఓట్ల కోసం అంతగా అవసరం లేని జనాకర్షక పథకాలు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు కేటాయిస్తారు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నల కోసం స్పెషల్ ప్యాకేజీలు లేవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధంగా రైతులను నిర్లక్ష్యం చేస్తే రైతులంతా తిరగబడతారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని .రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఎరువులు ఇవ్వాలని పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతు కూలీలకు కూడా రైతు బీమా సౌకర్యం కల్పించాలని కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని
also read :-===కిష్టాపురం గ్రామంలో నిరుపేదలు హాల్ చల్
రైతుల సమస్యలు మర్చిపోవటం కోసం కె సి ఆర్ రాజ్యాంగం మీద అనవసరంగా మాట్లాడి రైతుల దృష్టిని ప్రజల దృష్టిని రాజ్యాంగం మీద మళ్లించిననాడని.బీజేపీ టీఆర్ఎస్ రెండూ కలిసి డ్రామాలాడుతున్నారని గ్రామీణ ప్రాంతం నుంచికిసాన్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని రైతు సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ నాయకులు నిరంతర పోరాటం చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వర్ణ నరేందర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరప నర్సింహారావు .లచ్చగూడెం సర్పంచ్ బండ్ల విజయకుమారి .జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు మండెపూడి ఆనందరావు మూడు ముంతల గంగరాజు ఏటా శ్రీనివాసరావు ఉప్పెర్ల ఆనందప్రసాద్ తాళ్లూరి నర్సింహారావు జర్పల వెంకటేశ్వర్లు అయోధ్య గ్రామ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పికట్ల నాగేశ్వరరావు గుర్ర రమేష్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు