Telugu News

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో.

కలెక్టర్ దిగి వచ్చి సమాధానం చెప్పేవరకు విరమించేది లేదంటూ నినాదాలు.

0

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో.
కలెక్టర్ దిగి వచ్చి సమాధానం చెప్పేవరకు విరమించేది లేదంటూ నినాదాలు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల తరపున నెల్లుట్ల లింగస్వామి

(సూర్యాపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షులు) గురువారం స్థానిక కాసరబాద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుసుమవారి గూడెంకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రం DCMS, ఐకెపి నడుమ రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు రెండు సంఘాలకు అనుమతులిచ్చారని కానీ ఏ ఒక్క సంఘం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ సమాధానం చెప్పేంత వరకు రాస్తారోకోను విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.

విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన RDO గారు ఒక్క గంటలో సెంటర్ని ఓపెన్ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వగా దీక్షను విరమించడం జరిగింది.

also read :-ఢిల్లీ తరహా… ఎయిర్ పోర్ట్ వరకు…. హైదరాబాద్ మెట్రో….!