Telugu News

ముష్టికుంట వద్ద ఘోర ప్రమాదం..

అదుపుతప్పి బోల్తాకొట్టిన కారు..

0

ముష్టికుంట వద్ద ఘోర ప్రమాదం..

== అదుపుతప్పి బోల్తాకొట్టిన కారు..*

== బోల్తా కొట్టగానే లీకైన పెట్రోల్.. అలుముకున్న మంటలు.. కారు దగ్ధం..*

== ఇద్దరు వృద్ధులు మృతి..మరో ఇద్దరికి గాయాలు.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు

(బోనకల్- విజయం న్యూస్)

బోనకల్ మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

ప్రధాన రహదారి బోనకల్ ముష్టికుంట్ల మధ్యలో అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది.. కారులో ఇద్దరూ యువకులు ఇద్దరు వృద్ధులు ఉన్నారు. ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు యువకులను ఖమ్మం ప్రధాని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగటంతో ఒక్కసారిగా కారు లో మంటలు వ్యాపించాయి.. రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గమనించి కారు నుంచి బయటకు తీశారు