Telugu News

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

ఇల్లందు మండలం కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

0
*భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
** లారీ కారు ఢీ..నలుగురు మృతి…* 
** ఇల్లందు మండలం కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
(ఇల్లందు-విజయం న్యూస్)
ఇల్లందులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం రాత్రి కోటిలింగాల వద్ద జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… ఇల్లందు నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన మార్గం… కోటిలింగాల మూలమలుపు వద్ద  కారు౼లారీ ఢీకొన్న ఘటనలో… కారు నడిపిస్తున్న వ్యక్తితో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా …అక్కడ మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా …తీవ్రంగా గాయపడిన నర్సంపేటకు చెందిన రణధీర్ ను మెరుగైన చికిత్సకి ఖమ్మం తరలించారు…
మృతులు కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ జిల్లాకు చెందిన  … రాము,  కళ్యాణ్, శివగా గుర్తించారు.  … వీరంతా ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం… భద్రాద్రి జిల్లా మోతే ప్రాంతానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదం కోటిలింగాలు  విషాదం నెలకొంది.. కారు లారీ రోడ్డుపై ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించారు. క్షతగాత్రును ప్రభుత్వాసుపత్రి కి తరిలించగా, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.