Telugu News

వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

బాసరలో అక్షరాభ్యాసం కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం

0

వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

== ఐదుగురికి గాయాలు..

== బాసరలో అక్షరాభ్యాసం కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం

(వైరా-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు లారీ ఢీకొని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ఇది కూడా చదవండి:-  ఏన్కూరులో రోడ్డు ప్రమాదం…ఇద్దరి మృతి
కల్లూరు మండలం వాచా నాయక్ తండాకు చెందిన బానోత్ బాబు కుటుంబ సభ్యులతో తన మనవడు అక్షరాభ్యాసం కోసం బాసర సరస్వతి దేవి దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో
ఖమ్మం నుంచి కల్లూరు మండలం వాత్యా నాయక్ తండా వెళుతున్న కారును తల్లాడవైపు నుంచి వైరా వస్తున్న లారీ అతివేగంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ఇది కూడా చదవండి:-  ఏసీబీకి చిక్కిన ఏన్కూరు తాసిల్దార్

ఈ ప్రమాదంలో ఒకటిన్నర ఏళ్ల పాప బాణోత్ శ్రీవల్లి పాప తల్లి బాణోత్ అంజలి (30) పాప తాత అజ్మీర రాంబాబు( 58) మృతి చెందారు ఈ ప్రమాదంలో కారు నుజు నుజ్జయింది వీరితో పాటు ప్రయాణిస్తున్న బాణోత్ బాబు,బాణోత్ రాణి,బాణోత్ ప్రవీణ్,బాణోత్ స్వాతి,బాణోత్ కార్తికేయ కు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద విషయం తెలిసిన వెంటనే వైరా ఏసిపి రెహమాన్ సిఐ సురేష్ ఎస్ ఐ శాఖమూరి వీరప్రసాద్ తల్లాడ ఎస్సై సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగ్రాత్రులను ఖమ్మం తరలించి కేసు నమోదు చేశారు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడం ఆ గ్రామం శోకసముద్రంలోకి మునిగిపోయింది