Telugu News

జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు మృతి మరో ఐదుగురికి గాయాలు

0

జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

== ముగ్గురు మృతి మరో ఐదుగురికి గాయాలు

== అందరు జిల్లా వాసులే

(నల్లగొండ-విజయంన్యూస్):

హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.. ముగ్గురు యువకులు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలు పాలైన సంఘటన ఆదివారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.వీరంతా ఖమ్మం జిల్లా వాసులు కావడంతో ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతమంతా విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన 8మంది యువకులు హైదరాబాద్ లోని ఓ వివాహ వలీమా కార్యక్రమానికి కారులో వెళ్లారు. వివాహ కార్యక్రమంకు హాజరై తిరిగి ఇంటకి వస్తున్న సందర్భంలో తెల్లవారుజామున  హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢికొట్టగా కారు పూర్తిగా ద్వంసమైంది.

ఇది కూడ చదవండి: ‘పాలేరు’ రేసులో  ‘ఆ ఇద్దరు’

దీంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు, పోలీసులు నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలింపు. ఎండి ఇద్దాక్ (21), ఎస్ కే.సమీర్  (21), ఎస్ కే.యాసీన్ (18) చనిపోయారు.  దీంతో ఖమ్మం నగరంలోని ఖిల్లా సమీపంలో విషాదం నెలకొంది. అందర కావాల్సిన వారు కావడంతో ముస్లీంలు నార్కెట్ పల్లికి తరలివెళ్లారు. ఈ సంఘటన తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు జావిద్, కార్పోరేటర్లు, ముస్లీ,మైనార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడ చదవండి:రక్తదానం చేశాడు.. ప్రాణదాతగా నిలిచాడు..