Telugu News

తండ్రికొడుకు మృతికి హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యమే కారణం

* దెబ్బలు కొట్టి సస్పెండ్ చేసి చంపేశారు

0

తండ్రికొడుకు మృతికి హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యమే కారణం
** దెబ్బలు కొట్టి సస్పెండ్ చేసి చంపేశారు
** హార్వెస్ట్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
** హార్వెస్ట్ స్కూల్ ఎదుట మఇతుల భార్య,బందువులు ధర్నా
** పోలీసుల హామితో ఆందోళన విరమించిన బందువులు
(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్)
ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్ యజమాన్యం చేసిన తప్పులు ఫలితంగానే తండ్రి కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారని, తద్వారా మా కుటుంబాన్ని రోడ్డున పడిపోయారని, స్కూల్ యజమాన్యం పై తక్షణమే చర్యలు తీసుకుని సీజ్ చేయాలని, యజమాన్యాన్ని అరెస్టు చేసి న్యాయం చేయాలని బానుప్రకాష్, రాంబాబు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సత్తుపల్లి మండలంకు చెందిన భానుప్రకాష్ ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్ లో చదువుతుండగా, పుట్టిన రోజు వేడుకల సందర్భంగా యజమాన్యం మందలింపుతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి అంత్యక్రియలు అయిన తరువాత ఆదివారం కుమారుడి ఖనన స్థలం వద్దకు వెళ్లి తండ్రి రాంబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బందువులు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్ ఎదుట ధర్నా చేశారు.

allso read:- ఢిల్లీల్లో… కేంద్రాన్ని నిల‌దీసి… నిగ్గ‌దీస్తాం : ఎంపీ నామా

హార్వెస్ట్ స్కూల్ యజమాన్యం భానుప్రకాష్ దండించడం వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, తద్వారా తండ్రి ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని ఆనాదలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ స్కూల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
** అస్వస్తతకు గురైన రాంబాబు భార్య
హార్వెస్ట్ స్కూల్ ఎదుట ధర్నా చేస్తున్న సందర్భంలో మతుడు రాంబాబు భార్య ఉన్నట్టుండి అస్వస్తతకు గురై అక్కడి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు తక్షణమే ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కొంత నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆందోళన ఉదత్తమవుతున్న తరుణంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామినిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
** పాఠశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి : షేక్ బాజీ బాబా
హార్వెస్ట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి భానుప్రకాష్ మృతికి కారణమైన హార్వెస్ట్ పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా డిమాండ్ చేశారు. భాను ప్రకాష్ ను కులం పేరుతో దూషించి చిత్రవధన చేసి దెబ్బలు కొట్టి పది రోజులు స్కూల్ నుండి సస్పెండ్ చేసి అతని మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా డిమాండ్ చేశారు. హార్వెస్ట్ పాఠశాల యాజమాన్యం మొండి వైఖరి అవలంభిస్తోందని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. ఇదే విషయాన్ని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే ఈ విధంగా చర్యలు తీసుకుంటాం…

also read :-బుల్లెట్ పై ప్రజల వద్దకు మంత్రి అజయ్.