Telugu News

ఆదరించండి..అధిక మెజారిటీ అందించండి: రఘురాంరెడ్డి 

ఆర్యవైశ్యుల సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

0

ఆదరించండి..అధిక మెజారిటీ అందించండి: రఘురాంరెడ్డి 

== ఆర్యవైశ్యుల సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

 

(ఖమ్మం-విజయం న్యూస్):

ప్రజలకు సేవ చేయాలని ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని, అంతా ఆదరించాలని సీపీఐ, సీపీఎం బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాo రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం విన్ ఫీల్డ్ స్కూల్ సమీపంలో వైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. అంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి..భారీ మెజారిటీ అందించాలని కోరారు. అనంతరం వారితో కలిసి..అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణ కుమారీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్, గుర్రం తిరుమల రావు, చావా నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- ప్రచారంలో దూసుకుపోతున్న హీరో వెంకటేష్ కూతురు