Telugu News

భయమా..? అభయమా..?

** పూర్తి బలంగా ఉన్నప్పటికి క్యాంఫ్ కు ఓటర్లు

0

భయమా..? అభయమా..?
** పూర్తి బలంగా ఉన్నప్పటికి క్యాంఫ్ కు ఓటర్లు
** ప్రజల్లో ఆలోచన రేకేత్తించిన క్యాంఫ్ సందడి
** గెలుపు ధీమాలో మేకపోతు గాంభీర్యం
** లోలోపల భయంభయం
** నేతల మధ్య కుదరని సయోద్య
** ఇంకా పొత్తు తెల్చని మిత్రపక్షాలు
** ఖమ్మం ఎమ్మెల్సీలో ఏం జరగబోతుంది..?
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుందా..? ఓటర్ల విషయంలో టీఆర్ఎస్ అప్రమత్తమవుతుందా..? నేతలందర్ని ఐక్యం చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైందా..? అత్యధిక మెజారిటీ ఓట్లు ఉన్నప్పటికి గెలుస్తామనే ప్రకటన మేకపోతు గాంభీర్యమేనా..? అభ్యర్థి అందర్ని కలిసినప్పటికి నేతలేందుకు ఐక్యం కావడం లేదు..? అంతర్గత ఒప్పందాలున్నాయనే సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు నిజమేనా..? రెండు, మూడు స్థానిక సంస్థల స్థానాలు పోతే పోతాయ్ అని సీఎం కేసీఆర్ ఎందుకు అన్నారు..? ఆయన ప్రకటన వెనక రహస్యమేంటి..? అందులో భాగంగానే గోవాలో క్యాంఫ్ ఏర్పాటు చేశారా..? అసలు అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? ‘విజయం’ తెలుగు దినపత్రికలో అందించే విశ్లేషణాత్మక కథనం..

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సమయం అసన్నమైంది.. అతి కొద్ది రోజుల్లోనే పోలింగ్ జరగనుంది.. అందుకు గాను అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 10న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు అధికార పార్టీ నుంచి తాతా మధు సూధన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్రులుగా కొండపల్లి శ్రీనివాస్, సుధారాణి బరిలో నిలిచారు. అయితే ముఖ్యంగా పోరు ఉండేది మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే ప్రచారం జరుగుతుంది. అయితే రోజులుదగ్గర పడుతున్నా కొద్ది ఒక వైపు ఎన్నికలకు సంబంధించిన ప్ర్ర్రక్రీయ వేగవంతమవుతుంటే, మరో వైపు నేతల్లో టెన్షన్ నెలకొంది.. ప్రజల్లో క్షణంక్షణం ఉత్కంఠగా మారుతోంది. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ పార్టీకి చెందిన ఓటర్లను వివిధ ప్రాంతాలకు క్యాంఫ్ కు తరలించారు. అధికార పార్టీ ఓటర్లను గోవాకు తరలించగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని పక్క రాష్ట్రంలోని వైజాక్ బీచ్ కు తరలించినట్లు తెలుస్తోంది.. ఇరు పక్షాల నాయకులు కూడా భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ అభ్యర్థి భారీగా ఖర్చు చేస్తూ సుమారు 400కుపైగా ఓటర్లను గోవాకు విమానంలో, బస్సుల్లో తరలించారు.

బలమున్నప్పటికి భయంతోనా..? భరోసా కోసమా..?
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది.. ప్రత్యాయమ్నయం ఆలోచనే లేదు.. అసలు పోటీ చేసే వారే ఉండరు అనుకున్న తరుణంలో ప్రతిపక్షపార్టీ అభ్యర్థి నామినేషన్ వేశారు.. అయినప్పటికి 70శాతం ఓటింగ్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ వార్ గా విజయం సాధించే అవకాశం ఉంది.. ఎలాంటి క్యాంఫ్ లకు వెళ్లకుండానే సునాయసంగా మంచి మెజారిటీతో గెలవచ్చు.. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల విషయంలో కొంత భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.. కోట్ల రూపాయల ఖర్చు చేసి క్యాంఫ్ లకు ఓటర్లను తరలించారు..ఎవరికి అందనంత దూరంలో గోవాలో మకాం వేశారు.. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసిన పూర్తి బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ జిల్లాలో క్యాంఫ్ పెట్టిన ఇబ్బంది ఉండదు.. పైగా ప్రోటక్షన్ కూడా ఉండేది.. కానీ క్యాంఫ్ గోవాలో పెట్టడానికి గల కారణాలేంటో..? ఎవరికి అంతుబట్టడం లేదు.. ఇదిలా ఉంటే.. జిల్లాలో ఉన్న ప్రధాన నాయకత్వం (కొందరు మినహా) గోవాకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా గోవా వెళ్లున్నారు.. అయితే ఎందుకు టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. అధికార పార్టీ తరుపున గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీకి ఓటేసే అవకాశం లేదా..? లేకుంటే నేతల మాటల్లో స్పష్టత లేదా..? అందుకే గోవాకు వెళ్లాల్సి వచ్చిందా..? అనే సందేహాలు నెలకొన్నాయి.. అలా కాకుండా వాళ్లందరికి పార్టీ భరోసా ఇవ్వడానికి గోవాకు తీసుకెళ్లారా..? అనే అనుమానాలు సాటి సామాన్యుడ్ని ప్రశ్నిస్తోంది. అధికార పార్టీకి ఎన్నికలంటే భయమా..? లేదంటే క్రాస్ ఓటింగ్ పడుతుందనే అపనమ్మకా..? అనే సందేహాలు నేలకొన్నాయి..
ఐక్యమవ్వని ముఖ్యనేతలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నాయకత్వం ఉంది. రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు లాంటి వాళ్లతో పాటు వివిధ శాఖల చైర్మన్లు ఇలా బలమైన శక్తి ఖమ్మం టీఆర్ఎస్ లో ఉంది. వారు తలుసుకుంటే ఖమ్మం జిల్లాలో ప్రత్యర్థులే ఉండరు. గత ఎంపీ ఎన్నికల్లో అందరు ఐక్యంగా ఉండి నామా నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అందుకు ఆయన ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. అయితే ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యనాయకత్వం ఐక్యం కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మేమంతా ఒకేతాటిపై ఉన్నామని ప్రకటిస్తున్నప్పటికి ప్రాక్టికల్ గా చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థి పోయి ముఖ్యనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు అభ్యర్థిని ఆశీర్వదించారు. కానీ అది అప్పటి వరకే అనే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఇదే నాయకత్వం అప్పుడు ఉంది.. ఆ సమయంలో అందరు క్యాంఫ్ లకు వెళ్లి ఒటర్లకు భరోసా ఇచ్చారు. దీంతో బాలసాని లక్ష్మినారాయణ విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.. ఎవరికివారే ఎమునాతీరే అన్నట్లుగా నాయకత్వం ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు..
ఐక్యం కాకపోవడానికి కారణాలేంటి..?
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జిల్లాలో ఉన్న నాయకులు ఐక్యం కావడం లేదనే సంకేతాలు ప్రభుత్వానికి ఉన్నాయి.. ఇంటిలీజెన్సీ రిపోర్టు కూడా ప్రభుత్వం వద్ద, సీఎం కేసీఆర్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణాలేంటనేది రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.. ముఖ్యంగా తాతామధుసూధన్ అభ్యర్థిత్వం ఖరారు చేయడం పట్ల పలువురు ప్రధాన నాయకులు పలు రకాలుగా విమ్మర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలాంటి మహా నాయకులు ఉండగా తాతామధుసూధన్ కు ఇవ్వడం పట్ల కొంత ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వారికి సంబంధించిన వర్గీయులు టీఆర్ఎస్ అదిష్టానానికి కచ్చితంగా మనమంటే ఏంటో చూపించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రధానంగా పల్లా రాజేశ్వరర్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ అన్ని తానై చూసుకోవడం, టిక్కెట్ కూడా ఆయనే ఇప్పించాడనే ప్రచారం జరుగుతుండటంతో పక్క జిల్లావారి పెత్తనం ఎక్కువైందనే ప్రచారం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుత ఎమ్మెల్యేలతోనే పార్టీ కార్య్రకమాలు చేస్తుండగా, ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే స్థాయి నాయకులను కలవలేదన్నట్లు తెలుస్తోంది. వైరాలో మధన్ లాల్, సత్తుపల్లిలో పిడమర్తి రవి, మట్టదయానంద్, కొత్తగూడెంలో జలగం వెంకట్రావ్, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు ఇలాంటి వారిని కలిసిన దాఖలాలు లేకపోవడంతో వారు కూడా కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు విధులు, నీధులు లేవు, ఈ సందర్భంలోఅధికార పార్టీకి చెందిన అభ్యర్థిని ఓడిస్తే రాబోయే రోజుల్లో విధులు, నిధులు కచ్చితంగా వస్తాయనే ఆలోచనతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నట్లు తెలుస్తోంది.

మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందా..?
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తామని బల్లా గుద్ది చెప్పినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.. అందులో భాగంగానే టీఆర్ఎస్ తరుపున ఉన్న ఓటర్లను క్యాంఫ్ కు తరలించారు. వారందరు ఓటేసినప్పటికి మంచి మెజారిటితో గెలుస్తామని, కానీ కాంగ్రెస్, టీడీపీ, మిత్రపక్ష పార్టీల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి భారీగా ఓట్లు పడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అందులో మేకపోతు గాంభీర్యమే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంత మెజారిటీ ఉంటే క్యాంఫ్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా..? నేతలంతా ఐక్యంగా ఉండి తాతామధుసూధన్ గెలుపుకోసం పనిచేస్తారా.? ఈనెల 10న జరిగే పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే..?

also read ;- తిరుపతి లో పర్యటిస్తున్న సీఎం