Telugu News

అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం..?

** గెలుపు పై మేకపోతు గాంభీర్యం

0

అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం..?
** గెలుపు పై మేకపోతు గాంభీర్యం
** ఓటుకు మూడు లక్షల చొప్పున పంపకాలు..?
** స్వతంత్ర అభ్యర్థుల పై సందిగ్ధత
** స్వతంత్ర ఓటర్ల దారేటో..?
** ఏటు తేల్చని సీపీఎం, టీడీపీ.. టీఆర్ఎస్ వైపు సీపీఐ..?
** నేడు తేలనున్న భవితవ్యం..?
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడింది.. మరో 24గంటల్లో పోలింగ్ జరగనుంది.. ఎవరి భవితవ్యమేంటో..? ఓటర్లు తెల్చనున్నారు.. అయితే అభ్యర్థులు మాత్రం గెలుపు పై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.. మేమంటే మేమే గెలుస్తామని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఇరువురి అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. .. అధికార పార్టీ భారీ మెజారిటీ ఉన్నప్పటికి ఎక్కడో ఒక చోట స్వల్ప భయం కనిపిస్తోంది.. మెజారిటీ లేకపోయిన బరిలో నిలిచిన కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పై అధారపడి ఉంది.. స్వతంత్రులు మాత్రం మా సంఘం మాకే ఓటేస్తుందనే ఆలోచనలో ధీమాగా ఉన్నారు.. అయితే ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిక నువ్వా..నేనా అన్నట్లుగా జరుగుతుందా..? వన్ సైడ్ వార్ అన్నట్లుగా జరుగుతుందా..? క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయా..? అయితే క్రాస్ ఓటింగ్ ఎవర్ని ముంచుతుంది..? అసలు గెలిచేదేవ్వరో..? నిలిచేదేవ్వరో..? ఈనెల 14న తెలనున్న ఫలితంపై ’విజయం‘ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం. 

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమయం అసన్నమైంది..ఈనెల 10న పోలింగ్ జరగనుంది. అందుకు గాను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆధ్వర్యంలో సర్వం ఏర్పాట్లు చేశారు. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఖమ్మం, కల్లూరు పోలింగ్ కేంద్రంలో, భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై సర్వత్ర ఉత్కంఠ నేలకొంది.అత్యధిక ఓట్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి తాతామధుసూధన్, తక్కువ ఓట్లు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు బరిలో నిలవగా, ఎంఫీటీసీల ఫోరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, అదివాసి ప్రాంతం నుంచి కొండ్రు సుధారాణి బరిలో నిలిచారు. అయితే తాతామధుసూధన్, రాయల నాగేశ్వరరావు మాత్రం నువ్వా..నేనా..? అన్నట్లు ప్రచారం చేయడమే కాకుండా ఓటర్లను క్యాంఫ్ లకు తరలించారు. అత్యధిక భారీ ఖర్చు చేసి టీఆర్ఎస్ ఓటర్లను గోవాకు తరలిస్తే, అంతే స్థాయిలో ఆంద్రప్రదేశ్ రాష్ర్టంలోని మారేడుపల్లికి తమ ఓటర్లను క్యాంప్ కు తరలించారు. ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు చేసే విషయంలో రాజీ పడటం లేదు. ఇద్దరు ఇద్దరే అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు.
** ఓటు రూ.3లక్షలు..?
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యామా అని ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పోరేటర్లకు పండగ పండింది. బరిలో నిలిచిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతామధుసూధన్ తమ ఓటర్లకు ఓటుకు రూ.3లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కొంతమందికి ఓటుకు రూ.5లక్షలుఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా నేనేం తక్కువ అన్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు కూడా భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లతో పాటు ఇతర పార్టీకి చెందిన ఓటర్లకు కూడా ప్రతి ఓటుకు రూ.3లక్షల చొప్పున్న పంపిణి చేసినట్లు తెలుస్తోంది. మొదటిగా లక్ష చొప్పున పంపిణి చేసిన రాయల నాగేశ్వరరావు, ఆ తరువాత ఒక్కోక్క ఓటుకు రూ.’2లక్షల చొప్పున పంపిణి చేసినట్లు తెలుస్తోంది. ఓటర్లు కూడా తమ ఓటును మార్కెట్లో పెట్టి అమ్ముకున్నట్లుగా అమ్మతున్నట్లు సమాచారం. కొంత మంది నిజాయతీగా తమకు డబ్బులు వద్దని చెప్పినట్లు తెలుస్తోంది..

Allso read :- రాయల’ దైర్యమేంటి..?

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పోరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కొందరు రాయల నాగేశ్వరరావు ఔనిత్యాన్ని చూసి డబ్బులు రిజక్ట్ చేసి వారి డబ్బులను కూడా ఇతరులకు ఖర్చు చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఓటర్లు మాత్రం ఇరువైపుల డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది.
** క్రాస్ ఓటింగ్ భయం..?
ఎమ్మెల్సీ ఓటింగ్ అంటేనే క్రాస్ ఓటింగ్ కు ప్రధాన ద్వారం.. గతంలో ఖమ్మంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరిగింది. పోట్ల నాగేశ్వరరావు వర్సెస్ భట్టి విక్రమార్క పోటీ చేసిన సమయంలో పూర్తిగా మెజారిటీ ఉన్న పోట్ల నాగేశ్వరరావుపై భట్టి విక్రమార్క విజయం సాధించారు. అలాగే శీలం సిద్దారెడ్డి టైమ్ లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. బాలసాని లక్ష్మినారాయణ వర్సెస్ పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసిన సమయంలో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది.. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందోమేనన్న భయం అటు ప్రజల్లోను.. ఇటు అభ్యర్థులలో ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు, అభ్యర్థితత్వంపై కొంత మంది అలక, పెద్దలను గౌరవించలేదనే సాకు తదితర అంశాలేవైనా అవన్ని క్రాస్ ఓటింగ్ కు దారి తీస్తాయేమోనని పలువురు ఆ పార్టీ నాయకులు భావిస్తుండగా, రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థుల విషయంలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఫోరం పంచాయతీ రాజ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి బరిలో నిలిచిన కొండపల్లి శ్రీనివాస్ కు కొంత ఓటింగ్ పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

allso read :- భయమా..? అభయమా..? టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సంగతేంటీ..?

ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు విధులు, నిధులు లేవనే ఉద్దేశ్యంతో సమస్యల సాధన కోసం పోటీ చేసిన అభ్యర్థికి ఓటింగ్ పడే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే అదివాసిలను అణగతొక్కుతున్నారు, అదివాసిల సమస్యల పరిష్కారం కావాలంటే శాసనమండలిలో అదివాసి ఆడబిడ్డ ఉండాలి అనే ఆలోచనతో కొండ్రూ సుదారాణి బరిలో నిలిచారు. ఆమెకు కూడా కొంత అదివాసిలు ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీకి చెందిన ఓట్లు ఆ అభ్యర్థులకు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. కచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు బలాగుద్ది చెబుతున్నారు.
ఎటు తేల్చని కమ్యూనిస్టులు.. టీడీపీ..స్వతంత్రులు.?
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే న్యూడెమోక్రసీ పార్టీ ప్రజాప్రతినిధులతో కలుపుకుని 84 ఓట్లు స్వతంత్రులు ఉన్నారు. అందులో ఎవరు ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలియని పరిస్థితి నేలకొంది. ఇక సీపీఎం, సీపీఐ, టీడీపీ పార్టీల ఓట్లు కూడా చాలా కీలకంగానే ఉన్నాయి. అయితే సీపీఐ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతిస్తున్నప్పటికి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నప్పటికి వారు కూడా ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇక సీపీఎం పార్టీ మాత్రం గోడమీద పిల్లిలా అటు ఇటు కాకుండానే మిగిలిపోయింది. దీంతో సీపీఎం పార్టీ ఓట్లు వేటువైపు క్రాస్ అవుతాయో..? ఎవరికి అర్థం కావడం లేదు. సీపీఎం,సీపీఐ, టీడీపీ, స్వతంత్ర ఓటర్లు ఇరు పార్టీల అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
**  నేడు ఖమ్మంకు రాన్నున్న ఓటర్లు
క్యాంఫ్ లో భాగంగా గోవా వెళ్లిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. సుమారు వారం రోజుల పాటు గోవాలో ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సందడే సందడి చేశారు. వారితో అభ్యర్థితో పాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ముఖ్యనాయకులు గోవాకు వెళ్లగా, వారందరు మంగళవారం రాత్రికే హైదరాబాద్ చేరుకున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇంకా క్యాంఫ్ లోనే ఉన్నారు. వారందరు ఈనెల 9న బయలుదేరి, 10న ఉదయం నాటికి వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు.
**మాస్ పోలింగ్
సాధాహరణ ఎన్నికల్లో స్టాఫ్ తీసుకుని గుర్తుపై ఓటు వేసే సిస్టమ్ ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా కాకుండా మొదటి, రెండవ ప్రాధాన్యత ఓటు, మూడు, నాలుగవ వరస క్రమ ప్రాథాన్యత ఓటు ఉంటుంది. ఈ ఓట్లలో ఏ మాత్రం తేడా వేసిన ఓటు మురిగిపోవడం ఖాయం.. ఒక్కటికి బదులు రెండు వేసిన.. లేదంటే 1 వేసి రెండు మరిసి మూడు, నాలుగు నెంబర్ వేసిన ఆ ఓటు చెల్లుబాటు కాదు. అలాగే బ్యాలెట్ ఖాళీలో వేయకుండా మరేక్కడ వేసిన, వేరే గీత పడిన ఆ ఓటు చెల్లుబాటు కాదు. అందుకే ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే విషయంపై అవగాహణ కల్పించే విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాస్ పోలింగ్ ను నిర్వహించినట్లు తెలుస్తోంది. అవగాహణ శిక్షణ తరగతులు కూడా కల్పించినట్లు సమాచారం. మొత్తానికి ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి.. మరీ ఓటర్లు ఎవర్ని గెలిపిస్తారో..? ఎవర్ని ఓడిస్తారో..? రేపు జరిగే పోలింగ్ ను భట్టి తెలిసిపోతుంది. చూద్దాం.. రాజకీయ క్రీడాల పై చెయ్యి సాధించేదేవరో..?

also read :- మద్యం మత్తులో ఆటో డ్రైవర్ కారు డి.