Telugu News

ఫెడరల్ సిస్టంని ఖూనీ చేస్తోందని కేంద్రం పై విమర్శలు ..

విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి ....

0

ఫెడరల్ సిస్టంని ఖూనీ చేస్తోందని కేంద్రం పై విమర్శలు ..

విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి ….

అఖిలపక్ష సమావేశంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేకే .. నామ

తొలిరోజు పార్లమెంట్ గళమెత్తిన టీఆర్ఎస్ ఎంపీలు

ఢిల్లీ : రాష్ట్రాలను విస్మరిస్తూ ఫెడరల్ సిస్టంను భ్రష్టు పట్టించడంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు . సోమవారం బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర సంబంధిత అంశాలపై గళమెత్తారు . కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయించడంలో ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యం వహిస్తుందని నిరసన వ్యక్తం చేశారు . ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు టీఆర్ఎస్ పక్ష నేతలు నామ నాగేశ్వరరావు, కే.కేశవరావు నేతృత్వంలో ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు .

also read :-పల్లెల్లో కాంగ్రెస్ సభ్యత్వ పండుగ

రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేనందున … తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉన్నామని చెప్పారు . అనంతరం మధ్యాహ్నాం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే , లోక్ సభా పక్ష నేత నామ మాట్లాడుతూ భారత రాజ్యాంగం హామీనిచ్చిన ఫెడరల్ సిస్టంను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని … విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ద్వజమెత్తారు . దేశంలో అన్ని రాష్ట్రాలు కు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారనీ … తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయకపోవడం పై ప్రశ్నించారు .

అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు . తెలంగాణను కేంద్రం శత్రువుగా చూస్తున్నారని ప్రభుత్వాన్ని ఘాటుగా నిలదీశారు . కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని వివరించారు . ఉపాధి కల్పనకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని అన్నారు . వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ . 450 కోట్ల బకాయిలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వడం లేదన్నారు . తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు . దాంతోపాటు ఐటీఐఆర్ , కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హెూదా ఇవ్వలేదని విమర్శించారు . మిషన్ భగీరథ పథకానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ .24 వేల కోట్లు మంజూరు చేయలేదని మండిపడ్డారు . పార్లమెంట్లో ప్రజా సమస్యల పై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని నామా నాగేశ్వరరావు , కేకే తెలిపారు .