Telugu News

జీళ్ళచెరువు లో వైబోపేతంగా తెప్పోత్సవం..

తెప్పోత్సవంలో హాజరైన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.

0

జీళ్ళచెరువు లో వైబోపేతంగా తెప్పోత్సవం..

తెప్పోత్సవంలో హాజరైన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.

(కూసుమంచి-విజయం న్యూస్) :-

కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తెప్పోత్సవం కార్యక్రమం వైబోపేతంగా జరిగింది. ప్రతి ఏటా కార్తికపౌర్ణమికి తెప్పొత్సవం జరగడం అనువాయితిగా వస్తోంది.. అందులో భాగంగానే ఈ రోజు తెప్పొత్సవం ఘనంగా జరిగింది. ఈ శ్రీ సీతారామ చంద్రస్వామి తెప్పోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు శాసన సభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, సతీమణి విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. తెప్పోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం చెరువులో తిరిగే తెప్పోత్సవంలో పడవం శ్రీసీతారామచంద్రస్వామి వారితో పాటు విసరించారు. అనంతరం కోలాట కార్యక్రమం జరుగుతుండగా అక్కడికి వెళ్ళి కోలాటమేశారు. ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామినిచ్చారు. అలాగే చెరువు కట్టపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు. ప్రజలు పెధ్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కొండ సత్యం.. ఎంపీటీసీ అంబాల ఉమవేణు, జడ్పీటీసీ ఇంటూరి బేబి, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, నాయకులు.. కార్యకర్తలు హాజరైయ్యారు.

also read :- గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి మదుసూధనాచారి.

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*?*