Telugu News

ఖమ్మం జిల్లాలో ‘జ్వర’ సర్వే షూరు

== రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో రంగంలోకి దిగిన వైద్యసిబ్బంది

0

ఖమ్మం జిల్లాలో ‘జ్వర’ సర్వే షూరు
== రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో రంగంలోకి దిగిన వైద్యసిబ్బంది
== ఇంటింటికి తిరిగి జ్వర సర్వే చేస్తున్న వైద్యసిబ్బంది
== పర్యవేక్షణ చేస్తున్నమంత్రి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఫివర్ సర్వే కార్యక్రమాన్ని వైద్యశాఖ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజంభిస్తూ, కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనాపై యుద్దం ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింట ఫివర్ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి సర్వే ప్రారంభంగా కాగా, వైద్యసిబ్బంది రంగంలోకి దిగింది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తు, ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలతో పాటు.. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే టెస్టులు నిర్వహించి.. అప్పటికప్పుడే ఔషధ కిట్లు అందజేస్తున్నారు.
== ఐదుగురితో కలిసి ఒక టీమ్ గా
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వే చేసేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసింది. ఐదుగురితో కలిసి ఒక టీమ్ గా ఏర్పాటు చేశారు. ఒక ఆశాకార్యకర్త, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్ఏ లేదా బిల్ కలెక్టర్, మల్టీ పర్పస్ వర్కర్ తో కూడిన టీమ్ ను ఏర్పాటు చేశారు. గ్రామాల వారిక, జనాభ ప్రతిపాధికన ప్రతి గ్రామ పంచాయతీకి రెండు లేదా.. మూడు టీమ్స్ ను ఏర్పాటు చేశారు. వారిపైన సీనియర్ ఏఎన్ఎం, జూనియర్ ఏఎన్ఎంలు పర్యవేక్షణ చేస్తుండగా, మండల, జిల్లా వైద్యశాఖాధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. రోజుకు 50 ఇండ్లకు వెళ్లి సర్వే చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో టీమ్స్ వారిగా రోజుకు 100 నుంచి 150 ఇండ్లను సర్వే చేసి అతి కొద్ది రోజుల్లో జ్వర సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ప్రభుత్వం అంచనా వేయనుంది. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న సందర్భంలో తదపరి చర్యలపై రాష్ట్ర వైద్యశాఖ అడుగులు వేసే యోచనలో ఉన్నారు.
== వ్యాధిని గుర్తించే పనిలో జ్వర సర్వే టీమ్
గ్రామాల్లో, పట్టణంలో జ్వర సర్వే చేస్తున్న ప్రత్యేక టీమ్ సభ్యులు జ్వరపీడితిలను గుర్తిస్తున్నారు. ఆక్సిమీటర్ ద్వారా జ్వర పర్సంటేజీని గుర్తిస్తున్నారు. స్వల్ప లక్షణాలు కనిపిస్తే వారిని హోం హైసోలేషన్ కిట్లు అందిస్తున్నారు. ఎక్కువ లక్షణాలు రెండు మూడు రోజుల పాటు జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ఒక వేళ పాజిటీవ్ అని తెలితే వారికి కరోనా మందుల క్విట్ ను అందించి హోమ్ హైసోలేషన్ లో ఉంచుతూ రెగ్యూలర్ గా ఏఎన్ఎం, ఆశావర్కర్ల ద్వారా పరీక్షలు చేయిస్తున్నారు. ప్రతి రోజు వారిని పరిశీలించి అక్సిమీటర్ ద్వారా పర్శంటేజీను చూయించి ఆ తరువాత పరిస్థితిని భట్టి వైద్యసేవలను అందించనున్నారు.

ఎప్పటికప్పుడు అప్రమత్తం

ఇటీవల కేబినెట్‌ భేటీలో కరోనా కట్టడి చర్యలపై విస్తృతంగా చర్చించారు. రెండు కోట్ల కొవిడ్‌ కిట్‌లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జ్వర సర్వేతో పాటు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంటివద్దే ఉంటూ ప్రభుత్వం అందించే కిట్‌లోని మందులను వాడుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
== ముమ్మరంగా వ్యాక్సినేషన్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నివారణ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ముమ్మరంగా జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో 2932 మందికి, అలాగే సెకెండ్ డోస్ 10,273 మందికి , ప్రికాషస్ డోస్ 517 మందికి వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొత్తం 44,118 కాగా, 12,702 మందికి ప్రికాసెస్ డోస్ వేశారు. అలాగే టీనేజర్లే టార్గెట్ గా 52,318 మంది ఉండగా, 44,776 మందికి డోస్ లు వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే రెండవ డోస్ లు 1,38,232 కాగా 1,27,130 మందికి వేసినట్లు అధికారులు చెబుతున్నారు.

== మంత్రి, కలెక్టర్ల పర్యవేక్షణ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటింట సర్వే కార్యక్రమాన్ని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వి.పిగౌతమ్, అనుదీఫ్ లు పర్యవేక్షణ చేస్తున్నారు. కలెక్టర్లు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇంటింట సర్వే కార్యక్రమంపై ఆరా తీస్తున్నారు. ఇంటింట సర్వేకు దూరంగా ఉంటున్న టీమ్ సభ్యులపై చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం6గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటింట తిరిగి జ్వర సర్వే చేసిన అనంతరం ఆ సంఖ్యను మండల వైద్యాధికారికి సమాచారం అందించాల్సి ఉంటుంది. అది కాస్త మండల ఫిగర్ గా జిల్లా వైద్యఆరోగ్యశాఖకు, అక్కడ నుంచి మంత్రి, కలెక్టర్లకు సమాచారం అందనుంది. వారు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధంగా రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఏర్పాటు చేశారు. మొత్తానికి జ్వర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గ్రామాల్లో కొంత అలజడి మొదలైంది.