ఖమ్మం నగరంలో ఫీవర్ సర్వే ప్రారంభం
** ఇంటింట తిరుగుతున్న ఆశావర్కర్లు, వైద్యసిబ్బంది
ఏ మాత్రం లక్షణాలు కన్పించిన కరోనా టెస్ట్..
** మందుల క్విట్ అందజేత
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం నగరవ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తు, ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలతో పాటు.. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే టెస్టులు నిర్వహించి.. అప్పటికప్పుడే ఔషధ కిట్లు అందజేస్తున్నారు
also read;-ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్….!?
** ఎప్పటికప్పుడు అప్రమత్తం
ఇటీవల కేబినెట్ భేటీలో కరోనా కట్టడి చర్యలపై విస్తృతంగా చర్చించారు. రెండు కోట్ల కొవిడ్ కిట్‌లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జ్వర సర్వేతో పాటు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంటివద్దే ఉంటూ ప్రభుత్వం అందించే కిట్‌లోని మందులను వాడుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.