Telugu News

వరి ధాన్యం కొనుగోళ్ళ పై కేంద్రం మీద పోరుకు

సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

0

వరి ధాన్యం కొనుగోళ్ళ పై కేంద్రం మీద పోరుకు
సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

(హైదరాబాద్ విజయం న్యూస్):-

★ ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు
తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష
సమావేశం జరపాలని ముఖ్యమంత్రి ,
పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం

★ పార్టీ సమావేశంలో నిరసన పోరుకు రూపకల్పన

★ అదే రోజు ఢిల్లీకి ముఖ్యమంత్రి , మంత్రుల బృందం

★ ధాన్యం కొనుగోళ్లను డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రులను ,
ప్రధానిని కలవనున్న సీఎం కెసిఆర్, మంత్రులు

★ ధాన్యం కొనుగోళ్ళ పై లోక్ సభ, రాజ్యసభలో నిరసన
గళం వినిపించనున్న టిఆర్ఎస్ ఎంపీలు

★ పంజాబ్ తరహాలో 100 శాతం వరి ధాన్యం కొనుగోళ్ళు
చేపట్టాలని ఆందోళన కార్యక్రమాలను పిలుపు
ఇవ్వనున్న సీఎం కెసిఆర్

★ కీలకమైన ఈ సమావేశానికి పార్టీ ఆహ్వానితులందరూ
తప్పక హాజరు కావాలని సీఎం ఆదేశం

ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ హాజరుకానున్నారు.