Telugu News

పోరాట పటిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి: జావిద్

దేశ స్వాతంత్య్రం బలమైన పోరాటంతోనే సాధ్యమైంది

0

పోరాట పటిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి: జావిద్

== దేశ స్వాతంత్య్రం బలమైన పోరాటంతోనే సాధ్యమైంది

== నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

== రాంక్య తండాలో సంకల్ప దీక్ష

(రఘునాథపాలెం/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ప్రతి ఒక్కరూ పోరాట పటిమను అలవర్చుచుకోవాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ సూచించారు. ఖమ్మం నియోజక వర్గ స్థాయిలో రాహుల్ గాంధీ పై వేదింపులకు నిరసనగా  మంగళవారం రాంక్య  తండాలో చేపట్టిన సంకల్ప దీక్ష లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాద స్థాయిలోకి పడి పోతుందని  ఆవేదన వ్యక్తం చేశారు.  యెనిమిది ఏండ్లల్లో కాంగ్రెస్ 75 ఏండ్లుగా నిర్మించిన ప్రజా స్వామ్యన్ని బీజెపి మంట గలిపిందని ఆరోపించారు.బీజేపీ తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు దేశం మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని  తలపిస్తున్నాయని ఆరోపించారు. అధాని అక్రమాలపై ప్రశ్నించినందుకే రాహుల్ పై మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. రాహుల్ ప్రశ్నలకు మోడీ భయపడి తనని లోకసభలో లేకుండా చేశారని అన్నారు.రాహుల్ గాంధీని  విమర్శించే అర్హత బీజేపీ కి లేదని అన్నారు.భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక దుర్దినమని మూడు తరాలుగా ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం వారిదని తెలిపారు.

ఇదికూడా చదవండి: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు:పువ్వాళ్ళ

భారతదేశ సమైక్యత కోసం,దేశ అభివృద్ధి కోసం ఒక గొప్ప ఆర్థిక వేత్తను ప్రధానమంత్రి ని చేసిన ఘనత రాహుల్ గాంధీదని అన్నారు.తప్పుడు వాగ్దానాలతో కేంద్రం లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అంబానీ,ఆధానీ లకు ప్రభుత్వ రంగ సంస్థలు తాకట్టు పెట్టిందని విమర్శించారు. కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చిన సమయంలో చిన్న సాకుతో రాహుల్ గాంధీ ను  పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని అన్నారు.అదానీ మోడీ బంధాలపైన సాగుతున్న చర్చను దారి మళ్లించాలి. వీటినే డైవర్షన్‌ పాలిటిక్స్‌ అంటారని తెలిపారు. ఈ విషయమై తొలిసారి వివరంగా స్పందించిన రాహుల్‌ గాంధీ కూడా అనర్హత వేటు గురించి కన్నా కూడా అదానీని కప్పిపుచ్చి కాపాడే పన్నాగాలపైనే మాట్లాడారు.

అదే కారణమా? మోడీ ప్రభుత్వ ఆశీస్సులు అనుబంధంతో హఠాత్తుగా ఆకాశానికి పడగలెత్తిన అదానీ వ్యాపార సామ్రాజ్యం హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఒక్కసారిగా కుదైలైంది. ఒక దశలో కొందరు భారతీయ బడా వ్యాపారులు పెట్టుబడులు పెట్టి ఆదుకున్నా అది చాలలేదు. మరింత దిగజారుతున్న సమయంలో అమెరికాలోని సిజిక్యుటి అనే అనే ఫైనాన్స్‌ సలహా కంపెనీ అధినేత రాజీవ్‌జైన్‌ రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడిపెట్టి ఆదుకున్నారు. ఈయన కంపెనీ పెట్టింది 2016లోనే కావడం గమనార్హం. తన లావాదేవీలతో మూడు రోజుల్లో వేల కోట్లు ఆర్జించిన వ్యాపార మాయాజాలం ఈయన స్వంతం.

ఇదికూడా చదవండి: రాహుల్ అభినవ భగత్ సింగ్ – మాజీమంత్రి సంభాని

మరి ఈయన పతనమవుతున్న అదానీ కంపెనీలో ఎందుకు ఇంత భారీగా నిధులు సమకూర్చారు? డొల్ల కంపెనీల నుంచి ఇంత భారీ సహాయం అందడం వెనక ఎవరున్నారు? అనేది రాహుల్‌గాంధీ ప్రశ్న. ఈ ప్రశ్న తాను లోక్‌సభలో వేయడానికి ప్రయత్నిస్తే అవకాశం రాలేదని రాహుల్‌ చెబుతున్నారు. తర్వాత స్వయంగా స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి అభ్యర్థించినా తానే ఆ అనుమతించలేనని ఆయన జవాబావిచ్చారట. అదానీమోడీ బంధం గురించి మాట్లాడుతున్నాను కనుకనే, తన దగ్గర ఆ ఇరవై వేల కోట్ల వెనక ఎవరున్నారో చెబుతాను గనకనే వరుసగా అనేక అస్త్రాలు ప్రయోగించారని రాహుల్‌ విమర్శ. లండన్‌లో ఏదో మాట్లాడాననీ, మోడీ పేరిట బీసీలను అవమానించానని, సభను అగౌరవపరిచానని రకరకాల ఆరోపణలు అందుకే చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో తనకు అండగా నిలిచి మోడీ ప్రభుత్వ కక్ష పూరిత వైఖురిని ఖండించిన ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎనిమిదేళ్లు కాదు జీవితమంతా అనర్హుడిగా ప్రకటించినా ఎంతకాలం జైలులో పెట్టినా లొంగిపోకుండా పోరాడుతుంటానని  సవాల్‌ చేశారు.మేమంతా రాహుల్ గాంధీ గారి వెంట ఉంటామని కార్యకర్తలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ రఘునాధపాలెం  మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య బాలాజీ, 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, రబ్బానీ, ఏలూరి రవికుమార్, ఎంపీటీసీ తెజావాత్ వెంకన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రెంటాల ప్రసాద్, కొంటేముక్కల నాగేశ్వరరావు, మారం కరుణాకర్ రెడ్డి, కిలారూ వెంకటరమణ, చిమ్మపూడి గ్రామ శాఖ అద్యక్షులు జొనబాయిన పాపయ్య, చలమల రామారావు , బోడా తావుర్యనాయక్, గుగులోత్ అనీల్ , మెడబాయిన చిన్న మల్లేష్,బొడ వెంకటరమణ, లక్మా, అంగోత్ వెంకన్న,ఆలస్యం సూరయ్య, షేక్ వసీం, గోవర్ధన్, భూక్యా వెంకన్న, యూత్ కాంగ్రెస్ సోషల్ భూక్యా చిన్నయ్య, సాయి కుమార్, జటోత్ రాందాస్, కేలోత్ గొల్యా, భూక్యా శివలాల్, భూక్యా రమేష్, కెలోత్ సురేష్, తది తరులు పాల్గొన్నారు.

ఇది కూడ  చదవండి: పొంగులేటి ఖబర్దార్!