Telugu News

మోడీ, కేసిఆర్ ఆర్థిక విధానాలపై పోరాటాలు – పోతినేని

0

మోడీ, కేసిఆర్ ఆర్థిక విధానాలపై పోరాటాలు – పోతినేని

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నూతన ఆర్థిక విధానాలు ఫలితంగానే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఆరోపించారు.గురువారం సీపీఎం పార్టీ త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో జరిగిన జనరల్ బాడీ సభలో ఆయన మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా బిజెపి పాలనలో పెరిగాయి అని విమర్శించారు.భారత దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే మతల మధ్య చిచ్చు పెట్టి మతోన్మాదం పెరిగి దేశ అంతా అల్లకల్లోలం కావడం ఖాయమని పేర్కొన్నారు  ఆయన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము ప్రకారము మతాలు మధ్య రాజకీయ చిచ్చు పెట్టి దేశంలో అశాంతి వుండే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది అని ఆరోపించారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ ఈ రెండు కవలు పిల్లలు అని, ఆర్ఎస్ఎస్ ఆదేశాలు మేరకు మైనార్టీలపై దాడులు చేస్తున్నారు అని ఆరోపించారు.

allso read-  కలిసిన ‘తుమ్మల, రాయల’.ఏం జరిగిందంటే..?

బిజెపి దేశంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం విపరీతంగా పెరిగింది అని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఏమి తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో బిజెపి నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. హిందువులు పేరుతో మత రాజకీయాలు చేస్తూ హిందువులపై అదనపు ఆర్థిక భారాలు మోపడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో బిజెపి నేతలు వున్నారు అని విమర్శించారు. ఒక పక్క నూతన ఆర్థిక విధానాలతో దేశంలో సంక్షోభం ఏర్పడింది అని, మరోవైపు ప్రజలు ఉద్యమాల్లోకీ రాకుండా మతాన్ని ముందుకు తెచ్చి దేశ ప్రజలతో బిజెపి నేతలు ఆటలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వం హయాంలో కూరగాయలు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి అని విమర్శించారు. రాబోయే కాలంలో మోడీ, కెసిఆర్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరగబోయే ప్రజా ఆందోళనలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు . ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, త్రీ టౌన్ కార్యదర్శి భుక్యా శ్రీనివాస్ రావు, పార్టీ కార్పొరేటర్ యర్రా గోపి , నాయకులు బండారు యాకయ్య తదితరులు పాల్గొన్నారు

allso read- తుమ్మల  చేరికు అప్పుడే..?