Telugu News

రాయల తరుపునా నామినేషన్ దాఖలు 

కాంగ్రెస్ నుంచి రెండవ నామినేషన్

0

రాయల తరుపునా నామినేషన్ దాఖలు 

== కాంగ్రెస్ నుంచి రెండవ నామినేషన్

(ఖమ్మం -విజయం న్యూస్)

లోక్ సభ సాధారణ ఎన్నికలను పురష్కరించుకుని 17-ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావుకి చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కొంత మంది నాయకులు రిటర్నింగ్ అధికారికి అందించారు. ముహుర్త సమయానికి రాయల నాగేశ్వరరావు తరుపున కాంగ్రెస్ పార్టీ నాయకులు నామినేషన్ వేశారు..

ఇది కూడా చదవండి:- ప్రసాద్ రెడ్డి w/s రాయల.. అభ్యర్థి ఎవరు..?

దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు. పార్టీ అధిష్టానం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం తో కాంగ్రెస్ లో టిక్కెట్ ఆశావాహులు నామినేషన్లు వేస్తున్నారు. మొదటిగా రామసాహయం రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా రాయల నాగేశ్వరరావు రెండవ నామినేషన్ వేశారు. పోట్ల నాగేశ్వరరావు కూడా నామినేషన్ వేస్తున్నట్లు తెలిసింది.

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు, మొక్క శేఖర్ గౌడ్, బచ్చలికూరి నాగరాజు,చిలకాల రామక్రిష్ణ,కేతినేని వేణు,ఈవూరి శ్రీనివాసరెడ్డి,అమ్మపాలెం యంపిటిసి బాణోతు అనూష,ఆకూల శేఖర్,ధీరవత్ ఆనంద్, యడవల్లి నాగరాజు, గార్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు..