Telugu News

కుల వృత్తులందరికి ఆర్థిక సాయం అందజేయాలి: జావిద్

బీసీలందరికి అవకాశం ఇవ్వాలి

0

కుల వృత్తులందరికి ఆర్థిక సాయం అందజేయాలి: జావిద్

== బీసీలందరికి అవకాశం ఇవ్వాలి

== దరఖాస్తుల గడువును పెంచాలి

== పీసీసీ సభ్యులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

==  కలెక్టర్ కార్యాలయంలో వినతి

(ఖమ్మం-విజయంన్యూస్)

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెనకబడిన తరగతులకు అందించే కుల వృత్తులకు ఆర్థిక సాయం గడువు తేదీని పొడిగించాలని పీసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడనికి వెళ్ళిన ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో కార్యాలయ  సూపరిండెంట్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒక సమస్య పై మాట్లాడి రిప్రజెంటం ఇవ్వడానికి వస్తె కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్ఒ ఎవరూ అందుబాటులో లేకపోవడం చాలా దారుణం అని అన్నారు.

ఇది కూడా చదవండి:- బీసిలపై కేసీఆర్ ది సవతి తల్లి ప్రేమ:జావిద్

దశాబ్ది ఉత్సవాల పేరుతో యావత్ ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలను వదిలేసి ఉత్సవాల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెనక బడిన తరగతుల వారికి రుణ సాయం పొందేందుకు ధరఖాస్తు చేసుకోవడానికి తక్కువ సమయం ఇచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు లేకుండా ఉత్సవాలు చేయండి అని బయటికి పంపడం కేసీఆర్ మోస పూరిత ధోరణికి నిదర్శనమని అన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడానికి నెల రోజుల సమయం పడుతుందని ఎన్నికల కోసమే హుటా హుటిన ప్రకటన చేసి చేతులు దులుపుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం కేసీఆర్ ప్రయివెట్ సైన్యం లా వ్యవహరిస్తుందని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. దరఖాస్తు గడువును పెంచి బిసిలందరికీ న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, పల్లెబోయిన భారతి చంద్రం, లకావత్ సైదులు నాయక్, నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏలూరు రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్లమల సత్యంబాబు, గోపి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మైనారిటీ లకు 12% రిజర్వేషన్ కల్పించాలి: జావిద్