*ఖమ్మం పత్తి మార్కెట్ లో అగ్నిప్రమాదం..*
*2400 బస్తాలకు అంటుకున్న మంటలు..*
*మంటలను అర్పెందుకు ప్రయత్నిస్తున్న పైర్ సిబ్బంది..*
*మంటలు ఎలా అంటుకున్నాయనే విషయం పై ఆరా తీస్తున్న పోలీసులు..*
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం పత్తి మార్కెట్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి బస్తాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.ఈ అగ్నిప్రమాదంలో 2200 పత్తి బస్తాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
మంటలు ఎలా అంటుకున్నాయనే విషయంపై స్పష్టత లేదు. ఒక్క షెడ్డులో ఉన్న పత్తి బస్తాలన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే ఈ బస్తాలు రైతులకు సంబంధించినవా..? లేక వ్యాపారులకు సంబంధించినవా..? అనే విషయం అరా తీయగా అవి శ్రీనివాస్ రావు అనే ట్రైడర్ కు సంబంధించినవిగా గుర్తించారు.
==పత్తి వ్యాపారస్తులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు షెడ్లలో ఉన్న పత్తి అకస్మాకంగా మంటలలో దగ్ధం కావడం సుమారుగా 2000 పైన బస్తాలు పత్తి కాలిపోయింది శివ సాయి ట్రేడర్స్ చుట్టూరు శ్రీనివాసరావు అనే వ్యాపారస్తులు రైతుల దగ్గర కొనుగోలు చేసి ఎగుమతి కోసం స్టాక్ గా షెడ్ లో ఉంచారు ఈ ప్రమాదం జరిగింది ఇంత పెద్ద మార్కెట్లో ఫైర్ స్టేషన్ ని రంతరం ఉంచాలి గతంలో ఇక్కడ ఉన్న ఫైర్ స్టేషన్ ని నేలకొండపల్లికి మార్చడం సరైంది కాదని మరియు పర్మినెంట్ సెక్యూరిటీని నియమించాలని శివ సాయి ట్రేడింగ్ కంపెనీ వారినిప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా నున్న నాగేశ్వరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిపిఎం బృందం పత్తి మార్కెట్ వద్దకు వచ్చి దగ్గర పత్తిని పరిశీలించి మార్కెట్ కార్యదర్శి తో చర్చలు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరావు రైతు జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ సిపిఎం నాయకులు తుషాకులలింగయ్య బండారు యాకయ్య సోమవారం సుధీర్ బజ్జురి రమణారెడ్డి పగడాల మోహన్ రావు తదితరులు ఉన్నారు
ఇది కూడా చదవండి: 11ఏళ్ల బాలుడుకి పునర్ జన్మనీచ్చిన కిమ్స్ వైద్య బృందం