***ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలపాల్సిందే…
***రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి….
***కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేయాలి….
***అఖిలపక్ష పార్టీల సమావేశంలో నాయకులు…
(మణుగూరు టౌన్.విజయం న్యూస్)
భద్రాచలం లో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలపాల సిందే నని అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక శ్రామిక భవనం లో కోడిశాల రాములు అధ్యక్షతన సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, (న్యూ డెమోక్రసీ) తెలుగుదేశం, కాంగ్రెస్ ,నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ… కన్నాయిగూడెం ,పీచుకలపాడు, ఎటపాక, పురుషోత్తమ పట్టణం, గుండాల పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించాలన్నారు.
also read :-ఎలక్ట్రిక్ నానో కారులో రతన్ టాటా
కేంద్రంలో ఉన్న తెలంగాణ ఎంపీలు ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. అశాస్త్రీయంగా ఐదు గ్రామపంచాయతీలు ఆంధ్రా లో కలవడం వలన తెలంగాణ నుండి ఆంధ్ర లోకి వెళ్లి తెలంగాణలో కలిసే ఎటపాక వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. భద్రాచలం గుడి భూములు కూడా ఆంధ్రాలో ఉన్న గ్రామపంచాయతీలో ఉన్నాయన్నారు. దీనివలన రామాలయానికి ఆదాయం తగ్గిందన్నారు. భద్రాచలంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి పినపాక నియోజకవర్గం నుండి అఖిలపక్ష పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నాయన్నారు.
also read :-లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్
భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి మేము కూడా ముందుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, (సి పి ఎం )దుర్గ్యాల సుధాకర్, సర్వర్ పాషా, (సి పి ఐ) మధుసూదన్ రెడ్డి ,(ఇఫ్టు) వాసిరెడ్డి చలపతిరావు, కూచిపూడి బాబు,(తెలుగుదేశం) వీరస్వామి,నందం ఈశ్వరరావు, మునిగల శివ ప్రశాంత్ , తదితరులు పాల్గొన్నారు.