Telugu News

మానేరుపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయండి

కేంద్ర ఇంధన, పునరుత్పాదక శాఖ మంత్రికి బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి

0

మానేరుపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయండి
🔸కేంద్ర ఇంధన, పునరుత్పాదక శాఖ మంత్రికి బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి
(కరీంనగర్ -విజయంన్యూస్)
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని దిగువ, మధ్య మానేరు ప్రాజెక్టులపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఇంధన, పునరుత్పదాక శాఖ మంత్రి రాజ్ కమార్ సింగ్ బుధవారం ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. మానేరు నదిపై ‘ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్’ ను ఏర్పాటు చేయడంవల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ నిర్మాణం ద్వారా ఆనకట్టల నుండి నీటి ఆవిరిని తగ్గిస్తుందని, నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతాలకు ఇది ప్రత్యేకించి ప్రయోజనకరమన్నారు. ప్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుకు విలువైన భూ భాగం అవసరమే లేదని, పరిమితమైన స్థలంలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశాలను ద్రుష్టిలో ఉంచుకుని ఆయా ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను మంజూరు చేయాల్సిందిగా కోరారు.

ALSO READ :-తెలంగాణ రైతుల‌పై బీజేపీ ప‌గ‌ : మంత్రి పువ్వాడ.