Telugu News

ఖమ్మం కార్పొరేషన్ నిధుల వరద

100 కోట్ల నిధులను మంజూరు చేసిన తెలంగాణ సర్కార్ 

0

ఖమ్మం కార్పొరేషన్ నిధుల వరద

== రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసిన తెలంగాణ సర్కార్ 

== తన విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరు చేసినందుకు ఖమ్మం ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ.*

== మంత్రిగా నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మంత్రి పువ్వాడ కు అభినందనలు తెలుపుతూ జీవో కాపీని అందజేసిన మంత్రి కేటీఆర్ 

 

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్  నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కేటీఆర్ కి చేసిన విజ్ఞప్తి మేరకు టీయుఎప్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఖమ్మంకు రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి:- మంత్రి ‘అజయ్’ డే.. వెరీవెరీ స్పెషల్ డే..

శుక్రవారం ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా జీవో కాపీ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అందజేశారు. ఖమ్మం అభివృద్ధికి మరో రూ.100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ప్రజల తరుపున కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న అజయ్ కుమార్ కి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి:- పొంగులేటి జాగ్రత్త..నోరు ఆదుపులో పెట్టుకో : బీఆర్ఎస్