Telugu News

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల కోటా

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

0

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల కోటా

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు..

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. 17వ తేదీన పరిశీలన చేస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.