Telugu News

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

ఎంపీ మాలోతు కవిత

0

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

ఎంపీ మాలోతు కవిత

(మహబూబాబాద్ విజయం న్యూస్)

 

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్ మాలోత్ కవిత ఆదేశించారు.
గురువారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ప్రజాప్రతినిధుల తోనూ అధికారులతోనూ నిర్వహించారు.మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్ పర్సన్ మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా 37 అంశాలపై అంశం వారీగా వైద్యం, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజనం, ఉపాధి హామి, పెన్షన్ లు, ప్రధాన మంత్రి సడక్ యోజన, జాతీయ రహదారులు విద్యుత్ పథకాలపై సమీక్షించారు.ముందుగా గత సమావేశంలో సమీక్షించిన పనుల వివరాలను, చేపట్టిన పనుల వివరాలను డి. ఆర్. డి. ఒ. సన్యసయ్య సమీక్ష సమావేశం లో వివరించారు.461 గ్రామపంచాయతీలో స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షేడ్ లు నర్సరీలు పూర్తి చేయడం జరిగిందన్నారు.

హరిత హారం పరిరక్షణ తో పాటుగా ఉపాధి హామీ పనులు నిర్వహణలపై సమీక్షించారు.కొత్త జాబ్ కార్డ్ లు ఇవ్వటం జరిగిందని తెలిపారు. నిరుద్యోగ యువతను గుర్తించి మెరుగైన జీవన ఉపాధికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, కోవిద్ వలన గతంలో సమావేశం నిర్వహించ బడలేదని, గ్రీన్ ఫీల్డ్ పరిధిలో 51 కిలోమీటర్ల లలో ఐదు మండలాలలోని 18 గ్రామ భూ నిర్వాసితులకు నష్టపరిహారం విషయంపై చర్యలు తీసుకున్నామని త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లబ్ది చేకూర్చనున్నమని కలెక్టర్ వివరించారు.ఎమ్మెల్యే రేడ్యా నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ మండలంలోని అమ్మపాలెం లో పోస్టల్ శాఖ పై చర్య తీసుకోవాలని వారి ద్వారా పెన్షన్ లు సకాలంలో ఇచే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు.పెన్షన్ దారులను, వికలాంగులు, ఎటువంటి ఆధారంలేని వారికి సహాయ పడుతూ ప్రభుత్వ పథకాలు ద్వారా లబ్ది పొందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.జాతీయ రహదారులపై వరంగల్, ఖమ్మం అధికారులు తక్షణం రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, మరిపెడ నుండి ఎల్లంపేట స్టేజి వరకు, తొర్రూరు రహదారి పనులు, తొర్రూరు నుండి నెల్లికుదురు ప్యాచ్ పనులు సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై భారీ వాహనాలు వెళ్తున్నాయని, గుంతల మయంతో ఉన్న రోడ్లతో ప్రజలు ప్రమాదాలకు గురైతున్నందున మరమ్మతులు, రోడ్డు పనులు త్వరగా అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలనీ, రోడ్ ప్రమాద బాధితులకు నష్ట పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ములకలపల్లీ నుండి కురవి రోడ్, మరమ్మతు పనులు పురోగతిలో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపగా కురవి జాతర కంటే ముందుగా పనులు పూర్తి చేయాలని శాసనసభ్యులు రెడ్యానాయక్ జిల్లా కలెక్టర్ శశాంక సూచించారు.ఐటీడీఏ అధికారులు నివేదిస్తూ, ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్రింద నవంబర్ వరకు చేట్టిన పనులకు సంబంధించిన మొత్తం బిల్లులు చెల్లింపులు జరిగాయని, వైకుంఠ ధామలు, segregation sheds వివరాలు త్వ రితగతిన ఆన్లైన్ లో అప్డేట్ చేయాలన్నారు. రైతు వేదికలు.mnregs బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు.డోర్నకల్ లో labour component పెంచాలని, 100 నుండి 200 రోజులకు పని దినాలు పెంచాలని, ఈ. జి. ఎస్. నుండి గ్రామ పంచాయితీలకు ఒక వాచర్ ను ఏర్పాటు చేయాలని కోరగా, మొక్కల సంరక్షణ చేపట్టి అందులో వచ్చిన నిధుల నుండి ప్రతి రెండు వారాలకు ఇద్దరు చొప్పున వర్కర్ లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు.స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మన జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చాలని సూచించారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.

అంగన్వాడీ, పి హెచ్ సి సెంటర్ లలో టాయిలెట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా మంజూరు. చేసి, ప్రభుత్వ సంస్థల్లో ఏర్పాటు చేసే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కోరారు.గత కమిటీ లో జిపి లనుండి కమ్యూనిటీ టాయ్లెట్ కొరకు 10 శాతం నిధులు ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే స్కూల్ పై నుండి హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయనీ సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ కోరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.Intra విలేజ్ కు సంబంధించి మిషన్ భగీరథ క్రింద త్రవ్వుతున్న సీసీ రోడ్ లకు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని, భగీరథ లీకేజీ రిపేర్ లను చేపట్టి ప్రతి రోజు నీటి సరఫరా చేయాలనీ సర్పంచ్ కోరగా రోడ్ మరమ్మతు పనులు చేపట్టామని సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. ఎన్ పి డి సి ఎల్ ఎస్ ఈ నరేష్ మాట్లాడుతూ, దీన్ దయాళ్ యోజన కార్యక్రమం క్రింద ట్రాన్స్ఫార్మర్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, 24.6 కోట్లు ఈ స్కీం క్రింద ఖర్చు చేయడం జరిగిందని, 3 లక్షల వినియోగ దారులకు ప్రే పెయిడ్ మీటర్ లు ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టామని అన్నారు.

ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన క్రింద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, భూ సార పరీక్షలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్ వివరించారు.బయ్యారం సర్పంచ్ విజ్ఞాపన మేరకు, జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ రోడ్డుకు క్రింది భాగంలో ఉన్నందున వర్షాకాలం లొ పిల్లలకు ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు మినీ టాంక్ బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. డి ఎం హెచ్ ఓ హరీష్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో 74 సబ్ సెంటర్ లు మంజూరు కాగా కొన్ని నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, కో విత్ వ్యాక్సినేషన్ పై వివరిస్తూ 101% మొదట డోస్ పూర్తి చేసుకోవడం జరిగిందని, రెండవ డోసు 72 శాతం పూర్తి చేశామన్నారు డోర్నకల్ పల్లె దవాఖాన లు sanction అయ్యాయని, స్టాఫ్ నర్స్ ను అపాయింట్మెంట్ చేస్తున్నామని తెలిపారు.మినీ అంబులెన్స్ లను ఏర్పాటు చేసి జిపి ల ఆధ్వర్యంలో నడిపే విధంగా చూడాలని సర్పంచ్ కోరగా పరిశీలిస్తామన్నారు.
డి డబ్ల్యూ ఓ మాట్లాడుతూ, భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమాలను సమర్థవంతంగా చేపడుతున్నామని, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ వారిచే ప్రతి గ్రామంలో అవగాహన కలిస్తున్నమన్నరు.జిల్లా ఉపాధి అధికారి మాట్లాడుతూ, 4 ట్రైనింగ్ సెంటర్ లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు.
బిఎస్ఎన్ఎల్ అధికారులు మాట్లాడుతూ, గంగారం, బయ్యారం, కొత్తగూడ లో 3జి అప్గ్రేడ్ కొరకు ప్రతిపాదించినామని త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ డి ఎం ఐ ఎన్ ఎస్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర యోజన క్రింద జిల్లాలో ఖనిజాల పై సీనరేజ్ వసూలు చేస్తున్నామని, వసూలు అయిన ప్రతి వంద రూపాయలకు 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా డి ఎం ఎఫ్ నిధులు జమ అవుతాయన్నారు. క్వారీ లో ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో ఇట్టి నిధులను ఉపయోగి స్తున్నమని తెలిపారు. Seanerage ఖనిజ శాఖ వసూలు చేయడం జరుగుతుందని, R&B, పంచాయతీరాజ్ రోడ్లకు ఇతర పనులకు 20 కోట్లకు పైగా చెల్లించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
GM Industries నుండి employment generation పథకం క్రింద పరిశ్రమలు ఎర్పాటు చేయుటకు బ్యాంక్ లింకేజ్ ద్వారా దాదాపు పెద్ద పరిశ్రమలకు 25 లక్షలు, చిన్న పరిశ్రమలకు 10 లక్షలు అందిస్తున్నామని, మంచి పరిశ్రమ ఎర్పాటు చేయు సందర్భంలో ఎక్కువ మొత్తం కూడా ఆర్థిక సహాయం అందిస్తు ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటి వరకు 25 యూనిట్లు లక్ష్యం కాగా, 12 మందికి మంజూరు చేయడం జరిగింద నీ తెలిపారు.
చైర్ పర్సన్ మాలొతు కవిత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు సమీక్షలో తదుపరి సమావేశంలో అందరూ ఉన్నతాధికారులు పాల్గొనాలని, నేషనల్ హై వే పనులు పూర్తి చేయాలని, పింఛన్ల పంపిణీలో పోస్టల్ services సేవలను కంప్లైంట్ లు లేకుండా లబ్ది దారులకు చేరేలా కృషి చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో communication సేవలు bsnl వారు విస్తృతంగా అందించే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డోర్నకల్ శాసన సభ్యులు డి.ఎస్. రెడ్యా నాయక్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎంపిపి బయ్యారం చేపురి మౌనిక, చిన గూడూరు పద్మ వల్లూరి, danthalapally ఉమ వలదారి, డోర్నకల్ దరంసోతు బాలు, గంగారాం సువర్ణ పాక సరోజన, గార్ల ఎం. శివాజీ, గూడూరు బాణోతు సుజాత, కెసముద్రం వి. చంద్ర మోహన్, kothaguda బనోతు విజయ, కురవి గుగులోతు పద్మావతి, మహబూబాబాద్ భూక్యా మౌనిక, మరిపెడ గుగులోత్ అరుణ, narsimhulapeta టెకుల సుశీల, నెల్లికుడురు ఎర్రబెల్లి మాధవి, పెద్ద వంగర ఈదూరి రాజేశ్వరి, తొర్రూరు తూర్పాటి చిన అంజయ్య, మునిసిపల్ చైర్మన్ రామచంద్రయ్య, మహబూబాబాద్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, డోర్నకల్ వీరన్న, మరిపెడ సింధు కుమారి, నామినేటెడ్ మెంబర్ లు సర్పంచ్ లు నవీన్, సుష్మ గౌడ్, అజ్మీరా రజిత, ఆనంద్, మమత, ఎన్. జి. ఓ. ప్రతినిధులు పివి. ప్రసాద్, పి. శ్రీనివాస రెడ్డి zptc లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

aslo read :-అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్