Telugu News

విద్యార్థులకు కుల,ఆదాయ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

ఖమ్మం-విజయంన్యూస్

0

విద్యార్థులకు కుల,ఆదాయ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం-విజయంన్యూస్)

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం కార్పొరేషన్ 4వ డివిజన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్వయంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తెలంగాణలోని విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావి తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకై రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి వద్దకే పంపిణీ చేయాలన్న నిర్ణయం మేరకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతను ఇస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు మంచి సత్ఫలితాలనిస్తున్నాయి పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని వివరించారు.

నేడు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, సూడా చైర్మన్ విజయ్ గారు, జిల్లా కలెక్టర్ V.P. గౌతమ్ గారు, RDO రవీంద్రనాథ్ గారు, తహసీల్దార్లు నర్సింహారావు గారు, శైలజ గారు, సర్పంచ్ గుడిపూడి శారద, కార్పొరేటర్లు దండా జ్యోతి రెడ్డి, కమర్తపు మురళి, వివిధ శాఖల సిబ్బంది, నాయకులు ఉన్నారు.

also read :-♦️ దారి తప్పిన జింక పిల్లను అటవీ అధికారులకు అప్పగించిన మందమర్రి పోలీసులు