Telugu News

ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి

0

ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!
== తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
== ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
(ఖమ్మం రూరల్-విజయం న్యూస్):

ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రతి కార్యకర్త ఒక్కో శీనన్న కావాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఇందిరమ్మకాలనీ, సత్యనారాయణపురం, చిన్నతండా, నాయుడుపేట, జలగంనగర్, ఆర్టీసీ కాలనీ, పెదతండాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం కాంగ్రెస్ వలసల జోరు.. బీఆర్ఎస్ కు హడల్

అనంతరం ప్రజలకు అభివాదం చేసుకుంటూ పొంగులేటి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. పొంగులేటి మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో సంక్షేమం సాధ్యమౌతుందన్నారు. గడిచిన 9ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలుగా చేసిన కేసీఆర్ ను ఫాంహౌస్కే పరిమితం చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ కాలనీలో వైఎస్ఆర్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే పంచాయితీలో మిగిలాయన్నారు. బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన డబుల్బెడ్రూం పథకంలో ఒక్క ఇళ్లు కూడ ఇవ్వలేదని విమర్శించారు. కాలనీలో ఏళ్ల తరబడి ఉన్న ఇంటి నెంబర్లు, పట్టాలను తాను బాధ్యతగా తీసుకుని పరిష్కారిస్తానని హమీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:- గోరిలపాడుతండా లో పొంగులేటికి జననీరాజనం

ఇందిరమ్మ రాజ్యం వచ్చాక పెద్దతండాలో సెంట్రల్ లైటింగ్, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సశ్మానవాటికకు స్థలం కేటాయింపు తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, తదితర సౌకర్యాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఈ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి ఆగిపోవాలని తాను అనుకోవడం లేదని, ప్రజాసేవ చేసుకునే వయసు తనకెంతో ఉ ందని అందుకే మరోమారు ప్రజల్ని ఓటు అడగాల్సి వస్తే.. ఇచ్చిన హామీలు నెరవేర్చాకేనన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనన్నారు.

ఇది కూడా చదవండి:-:మాట ఇస్తున్నా…. తప్పేది లేదు: పొంగులేటి