Telugu News

సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్తున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్తున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

0

సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్తున్నారా..? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుంచి త‌మ సొంతూర్ల‌కు వెళ్లే వారికి సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇండ్ల‌లో చోరీలు జ‌ర‌గ‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, కొత్త‌వారి క‌ద‌లిక‌ల‌పై కాల‌నీలో ఉంటున్న వారు త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు స‌మాచారం అందించాలి అని సూచించారు.

also read;-ఐదు రాష్ట్రాలకు మోగిన నగారా

కాల‌నీలు, ఇంటి ప‌రిస‌రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. బైక్‌లు, కార్ల‌ను ఇండ్ల ఆవ‌ర‌ణ‌లోనే పార్కింగ్ చేయాలి. విలువైన వ‌స్తువులను బైక్‌లు, కార్ల‌లో పెట్టొద్దు. ఇంట్లో ఏదో ఒక గ‌దిలో లైటు వేసి ఉంచాలి. పేప‌రు, పాల‌వారిని రావొద్ద‌ని చెప్పాలి.

also read;-ఖమ్మం నగరంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..

టైమ‌ర్‌తో కూడిన లైట్ల‌ను ఇంట్లో అమ‌ర్చుకోవాలి. ఇంటి డోర్‌కు సెంట్ర‌ల్ లాకింగ్ సిస్ట‌మ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్ర‌జ‌లు త‌మ ప్రాంతాల్లో గ‌స్తీ ఏర్పాటుకు స‌హ‌క‌రించాలి. పోలీసు స్టేష‌న్, బీట్ కానిస్టేబుల్ నంబ‌ర్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. ప్ర‌జ‌లు, పోలీసుల స‌మ‌న్వ‌యంతో చోరీల నియంత్ర‌ణ సుల‌భం. న‌మ్మ‌క‌మైన వాచ్‌మెన్‌ను నియ‌మించుకోవాలి. బంగారు, న‌గ‌లు, న‌గ‌దు.. బ్యాంకు లాక‌ర్ల‌లో పెట్టుకోవాలి అని సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర సూచించారు.