Telugu News

వైఎస్ఆర్ కు..భట్టికి ఒకే తేది..ఒక్కటే సంఘటన

దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైన ఈ సంఘటన

0

వైఎస్ఆర్ కు..భట్టికి ఒకే తేది..ఒక్కటే సంఘటన

== దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైన ఈ సంఘటన

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నాడు వైఎస్ఆర్..నేడు భట్టి విక్రమార్క.. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన నేతలు.. పార్టీ మారేవారు అసలే కాదు.. అందుకే వారికి పార్టీలో అంత గుర్తింపు.. అయితే  ఇది యాధృచ్చికమే.. దేవుడు కల్పించిన జాతకమో తెలియదు కానీ.. ఆ ఇద్దరు నేతలకు ఒకే తేది..ఒకే రోజున  ఓ సంఘటన జరిగింది.. ఆ సంఘటన సంచలనంగా మారింది.. ఇంతకు ఆ సంఘటన ఏంటీ..? ఎందుకు ఒకే తేదినా వారిద్దరికి ఇలా జరిగింది.. అసలు విషయం తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వార్తను పూర్తిగా చదవండి:

ఇది కూడా చదవండి: అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి

స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 68 రోజుల తరువాత పాదయాత్రను ముగించారు. నాడు తెలుగుదేశం పార్టీ 10ఏళ్ల పాటు పాలించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదును పెడుతూ ప్రజల్లోకి వెళ్లారు.. అప్పుడు ఆయన సీఎల్పీ నేతగా ఉన్నారు. గ్రామాల్లో పర్యటించి  ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకు సాగారు.. ఎండ, వానను సైతం లెక్కచేయలేదు.. ఎంతో నిబద్దతతో పాదయాత్ర చేశారు. నాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. వైఎస్ఆర్ సీఎం అయ్యారు.  అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి… ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్‌ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్‌’ అన్న భావన స్థిరపడింది.  అదే తరహాలో నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర  వైఎస్ఆర్ పాదయాత్రను తలపిస్తోంది..

ఇది కూడ చదవండి: భట్టి విక్రమార్క త్వరగా కోలుకోవాలి: జావిద్

నాడు తెలుగుదేశం పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉండగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుండగా వైఎస్ఆర్ పాదయాత్ర చేయగా, నేడు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తుండగా, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. వైఎస్ఆర్ తరహాలోనే గ్రామాల్లోనే టెంట్లో ఉంటూ చెట్లకిందనే పండుకుంటూ, పండ్ల పుల్లలు వేస్తూ వైఎస్ఆర్ పాదయాత్రను మైమరిచే విధంగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. అయితే అది యాధృచ్చికమే ఏమో కానీ.. ఓ సంఘటన జరిగింది.. అదేంటంటే..?

== ఒక్కటే తేది..? ఓ సంఘటన

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏప్రిల్ 9, 2003లో పాదయాత్ర చేపట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మార్చి 16, 2023న ప్రారంభించారు. అంటే సుమారు 20ఏళ్ల తరువాత ఈ పాదయాత్ర ప్రారంభమైంది.. అయితే నాడు వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తుండగా మే 18, 2003న ఎండతీవ్రతకు వడదెబ్బకు గురైయ్యారు. నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మే 18, 2023న వడదెబ్బకు గురైయ్యి చికిత్స పొందుతున్నారు. ఇది యాధృచ్చికమే..అనుకోకుండా జరిగిందో..? దేవుడు అలా క ల్పించాడోమో కానీ ఇద్దరు సీఎల్పీ నేతలు పాదయాత్ర చేస్తుండగా ఒకే తేదిన ఎండతీవ్రతకు వడదెబ్బకు గురికావడం గమనర్హం. అయితే తీవ్ర ఎండలు దృష్ట్యా మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురి కావడంతో డాక్టర్లు సలహా మేరకు భట్టి విక్రమార్క పాదయాత్ర స్వల్ప విరామం ఇచ్చారు. ఆయన త్వరగా కోలుకోని తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ శనివారం ఖమ్మం నగర కాంగ్రెస్ ఆధ్యర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

== ఇద్దరు నేతలకు ఒకే రోజా..?అస్వస్థత కావడం గమనర్హం : జావిద్

స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు పాదయాత్ర చేస్తుండగా మే 18న అస్వస్తతకు గురైయ్యారు. దీంతో సుమారు మూడు రోజుల పాటు పాదయాత్రకు బ్రేకి ఇచ్చారు. నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుండగా మే 18న అస్వస్తతకు గురి కావడం బాధాకరమైనప్పటికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇద్దరు సీఎల్పీ నేతలకు ఒకే తేదిన  వడదెబ్బకొటడం, అస్వస్తతకు గురి కావడం యాధృచ్చికమే అయినప్పటికి నాడు వైఎస్ఆర్ పాదయాత్ర పూర్తైయిన తరువాత ఏం జరిగిందో..? తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా అదే జరగబోతుందని, అది దేవుడే తెల్చి చెప్పాడని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క త్వరగా కోలుకోవాలని దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు.