Telugu News

గుత్తి కోయల దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతి

ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి...

0

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడి

== ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి…

(భద్రాద్రి కొత్తగూడెం-విజయం న్యూస్): చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు లో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తి కోయలు (వలస ఆదివాసులు) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. శ్రీనివాస్ మృతితో ఉమ్మడి జిల్లా పారెస్టు అధికారులు కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడగలరు:- అటవీ రేంజర్ పై గుత్తి కోయల దాడి