Telugu News

రాజ్యాంగం అమలువల్లే చిన్న రాష్ట్రాల ఏర్పాటు: ఆర్ జేసీ కృష్ణ

ఎస్.బి. ఐ.టి.,ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ

0

రాజ్యాంగం అమలువల్లే చిన్న రాష్ట్రాల ఏర్పాటు:కృష్ణ

== ఎస్.బి. ఐ.టి.,ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ

(ఖమ్మం-విజయంన్యూస్)

బాబాసాహెబ్ అంబేత్కర్ రాజ్యాంగాన్ని ఆనాడు తయారు చేయడం వల్లనే నేడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమవుతుందని ఎస్.బి. ఐ.టి.,ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ అన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఖమ్మం ఆర్జేసి కళాశాల ఎన్.ఎస్.ఎస్.విభాగం ఆద్వర్యంలో లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అతిధి గా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ ఏర్పాటు వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడిందన్నారు. విద్యార్థులు రాజ్యాంగం పై అవగాహన పెంచు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ యం.శివకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.లింగయ్య,ఎన్.ఎస్.ఎస్.అధికారులు రాంబాబు, రమేష్,సైన్స్ ఇంచార్జీ ఉపేందర్ లతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

allso read- ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి​ పువ్వాడ అజయ్ అభినందనలు