ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్
== విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
(అమరావతి-విజయం న్యూస్)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు.
నంద్యాలలో చంద్రబాబు ను అరెస్టు చేసిన పోలీసులు
స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అక్రమాలు జరిగినట్లు చంద్రబాబు పై ఎఫ్ఐఆర్..ఏ1 గా చేర్చాన సీఐడీ పోలీసులు
సీఐడీ కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
భారీ కాన్వాయ్ లో విజయవాడ కు తరలిస్తున్న సీఐడీ అధికారులు
చిలకలూరిపేట వద్ద నేషనల్ హైవే లో చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
భారీగా చేరుకుని రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు
టైర్లను కాలుస్తూ.. వాహనాలను అడ్డు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు
అరగంట నుంచి హైవేపై నిలిచిపోయిన పుల్ ట్రాఫిక్ జామ్
చిలకలూరిపేట కు చేరుకుంటున్న పోలీస్ బలగాలు
పార్టీ శ్రేణులను హౌజ్ అరెస్టు చేసే అవకాశం
హైవేపై ఉద్రిక్తత పరిస్థితి..