Telugu News

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పాండ్య నాయక్

పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక

0

*కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పాండ్య నాయక్

== పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక

(ఖమ్మం-విజయం న్యూస్)

కూసుమంచి మండలంలో కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి.. అధికారం బీఆర్ఎస్ పార్టీ కి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఇది కూడా చదవండి:- నేలకొండపల్లిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు*

కూసుమంచి మండలం కోక్యతండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ పాండ్య నాయక్ తో పాటు మరికొంతమంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరందరూ మాజీ మార్తెకెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి:- ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కుటుంబం దూకుడు