Telugu News

ఏన్కూరులో ఆగని మాజీ సీఎం కేసిఆర్

నిరుత్సాహ పడిన బీఆర్ఎస్ క్యాడర్

0
ఏన్కూరులో ఆగని మాజీ సీఎం కేసిఆర్
== నిరుత్సాహ పడిన బీఆర్ఎస్ క్యాడర్
ఏన్కూరు ఏప్రిల్ 30:
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం సాయంత్రం ఏనుకూరులో ఆగకుండా వెళ్ళిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఏనుకూరులో కేసీఆర్ రోడ్ షో లేదు. అయినప్పటికీ కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు ఏన్కూరు చేరుకున్నారు. ఏన్కూరు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ దగ్గర కొంచెం సేపు ఆగుతారనే సమాచారంతో కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఏనుకూరు సమీపానికి రాగానే నాయకులు కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ వాహనాన్ని ఆపాలనే ఆలోచనతో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. దీంతో సెక్యూరిటీ పోలీసులు వారిని సముదాయించి పక్కకు పంపించడంతో వాహన శ్రేణి కొత్తగూడెం వెళ్లిపోయింది. అయితే కార్యకర్తలు మాజీ సీఎం వాహనాన్ని కొంచెం సేపు ఆపినప్పుడు కేసీఆర్ తో పాటు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కార్యకర్తలకు బస్సు లో నుంచే అభివాదం చేశారు.మాజీ సీఎం వెంట వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఉన్నారు.