బిగ్ బ్రేకింగ్.. భద్రాచలం లో విషాదం
దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి,
బిగ్ బ్రేకింగ్.. భద్రాచలం లో విషాదం
== మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం
== దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి,
== సంతాపం వ్యక్తం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు
(భద్రాచలం-విజయం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి సోమవారం తెల్లవారుజామున హఠాన్మరణం జరిగింది.భద్రాచలం లోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో, నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో తక్షణమే వైద్య సేవలను నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ లో భారీ కుదుపు
2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజ సత్యవతి ఆ తర్వాత 2014 ,2018లో బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. కుందే సత్యవతి హఠాన్మరణ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఆమె మృతి పట్ల మాజీ మంత్రి తుమ్మల సత్యవతి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.2009 నుంచి 2014 వరకు అసెంబ్లీలో అనేక అంశాలను లేవనెత్తి జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని తుమ్మల గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి:- ములుగు జడ్పీ చైర్మన్ గుండెపోటుతో మృతి
కుంజా సత్యవతి మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, మహబూబాద్ ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, భద్రాచలం ఎమ్మెల్యే పోడే వీరయ్య సంతాపం వ్యక్తం చేశారు. సత్యవతి మరణంతో భద్రాచలం విషాదంలో మునిగింది.