Telugu News

*వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి

**ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

0

***వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
***ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
***ధ్వజస్థంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ
***వధూ-వరులకు నూతన వస్త్రాల బహుకరణ
***కార్యకర్తల కుటుంబాలకు ఓదార్పు, ఆర్ధిక సహాయం

(ఖమ్మం జిల్లావిజయం న్యూస్):-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్, జూలూరుపాడు, వైరా, బోనకల్, తల్లాడ, సత్తుపల్లి, ఖమ్మం పట్టణాల్లో పర్యటించారు.

పాల్వంచ/కొత్తగూడెం/ సుజాత నగర్ : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించారు. గట్టుమల్ల గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయంలో పొంగులేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పొంగుటికి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

also read :-.***ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలపాల్సిందే…

రేగళ్ల గ్రామంలో నాగేంద్రాచారి కుమారుడు పంచకట్టు వేడుక, కుమార్తె ఓణీలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వాదించి నూతన వస్త్రాలను అందజేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇటీవల ఆపరేషన్ చేయించుకోగా వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెసుకున్నారు. పాల్వంచ శివానగర్ లో మురళీధర్ రెడ్డి మనుమరాలు వివాహం ఇటీవల జరిగినందున దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. వడ్డేగూడెంలో పుల్లయ్య కుమారుని వివాహం సందర్భంగా పెళ్లి కుమారుని దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. రామకృష్ణ కుమారుని వివాహం ఇటీవల జరిగినందున దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీలో సంగెం జంగయ్య మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొత్తగూడెం క్లబ్ సమీపంలో రేవతి-వంశీకృష్ణ వివాహ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వాదించారు.

also read :-మృతి చెందిన కుటుంబా న్నీ పరామర్శిస్తున్నసంభాని చంద్రశేఖర్

చిట్టిరామవరంలో సాంభశివ నాయక్-నందిల వివాహం సందర్భంగా వారిని దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. జంగాల పద్మనాభరావుగారి కుమార్తె వివాహ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సుజాత నగర్ లో వంశీకృష్ణ-ఇందుల వివాహం సందర్భంగా వధూవరులను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు. బంగారు చిలక సర్పంచ్ బొర్రా శంకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినందున ఆయనను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యానగర్ లో కుషన్ రాజ్ కుమార్ చనిపోయినందున ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

లక్ష్మీదేవిపల్లిలో గుండా పర్వతమ్మ ఇటీవల మృతిచెందగా ఆమె చిత్రపటం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యలను ఓదార్చి ఆర్ధిక సహాయంను అందజేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ఉకంటి గోపాల్ రావు, తూము చౌదరి, ఆర్ల మురళి, టీబీజీకే వైస్ ప్రెసిడెంట్ రజాక్, సోమిరెడ్డి, నాగేందర్ త్రివేది, గౌస్ భాయ్, భద్రయ్య, ప్రసాద్, లగడపాటి రమేష్, రమణారెడ్డి, ఆవుల మధు, అనపర్తి వెంకటేశ్వర్లు, సతీష్, భట్టు రమేష్, కొప్పుల రమణారెడ్డి, వేల్పుల అనంతరాములు, బండ వెంకటేశ్వర్లు, పడిగ సీతయ్య, గాయత్రి, వేల్పుల రమేష్, వేల్పుల గంగాప్రసాద్, వేల్పుల వీరబాబు, దేవరపల్లి ప్రసాద్, పరిపర్తి భద్రయ్య, బొల్లం రామయ్య, వనపర్తి వెంకటేశ్వర్లు, వజ్జా రాజు, చిరంజీవి, అనంతుల మల్లిఖార్జున్, అంకిరెడ్డి శ్రీను, అల్లి రమణయ్య, పారిపర్తి రాంబాబు, బొబిశెట్టి సాంబయ్య, ముక్కర వెంకన్న, మల్లేష్, గోపి, సీతయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

also read :-పులకించిన పిండిప్రొల్

జూలూరుపాడు : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జూలూరుపాడు మండలంలో పర్యటించారు. బేతాలపాడు గ్రామంలో గుగులోత్ మోహన్ కుమార్తె సంధ్య -ఇంద్రలాల్ వివాహం సందర్భంగా దంపతులను ఆశీర్వాదించి నూతన వస్త్రాలను అందజేశారు. బేతాలపాడు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్త బొడ్డు కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శ ఆర్ధిక సహాయంను అందజేశారు. గురవాగు తండాలో రాజేష్ కుమార్ సుప్రియల వివాహ వేడుకలో పాల్గొని దంపతులను దీవించి పట్టు వస్త్రాలను అందజేశారు. కాకర్ల ఎస్సీ కాలనీ వెంకటేష్- ప్రమీళల వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, ఎంపీపీ సోని, ఎంపీటీసీ మధూసుధన్ రావు, సర్పంచ్ నరేష్, రాందాస్, దారావత్ రాంబాబు, నాగరాజు, శ్రీనాధ్ రాజు, రాంశెట్టి నాగేశ్వరరావు, నాగయ్య, రామకృష్ణ, భద్రయ్య, వెంకట నారాయణ, ముత్తయ్య, లేళ్ల గోపాల్ రెడ్డి, పుప్పాల నర్సింహారావు, చలమల నర్సింహారావు, అల్లడి లింగారావు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

వైరా : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం వైరా మండలంలో పర్యటించారు. గొల్లపుడి గ్రామంలో జెర్రిపోతుల కుటుంబరావు కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలన అందజేశారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన చావా శ్రీనివాసరావు కుమార్తె వివాహ నిశ్చితార్ధ మసూత్సవంలో పాల్గొని నూతన జంటను దీవించి శుభాకాంక్షలు తెలిపారు. శబరి గార్డెన్స్ లో జరిగిన కొప్పురావూరి వెంకటకృష్ణ తల్లి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సుతగాని జైపాల్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, ఇటుకల మురళి, చింతనిప్పు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

బోనకల్ : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం బోనకల్ మండలంలో పర్యటించారు. గోవిందాపురం ఏ గ్రామంలో బోడేపుడి శేషగారిరావు మేనల్లుడు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు.

భర్త చనిపోయి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఝాన్సీని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. భాగం సిరయ్య చనిపోయినందున ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్, డీసీసీబీ డైరెకర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, బోనకల్ సర్పంచ్ సైదా నాయక్, గోవిందాపురం ఏ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు, రాయన్నపేట సర్పంచ్ కిన్నెర పాపారావు, హస్నగుర్తి సర్పంచ్ మురళి, ఉమ్మినేని కృష్ణ, సండ్ర కిరణ్, తోటకూర వెంకటేశ్వరరావు, తమ్మారపు బ్రహ్మం, భాగం నాగేశ్వరరావు, కొయినేని ప్రదీప్, బోయినపల్లి మురళి, నల్లినబోయిన కృష్ణ, బండి వెంకటేశ్వర్లు, ఇరుగు భూషనం, మామిళ్ల కృష్ణయ్య, షేక్ పకీర్ సాహెబ్, సండ్రా కృష్ణ, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు తన్నీటి సురేష్, భాగం రాకేష్, వడ్డెబోయిన సతీష్, భాగం పాపారావు, గ్రామ రైతు కోఆర్డినేటర్ భాగం మధుసూధనరావు, వడ్డెబోయిన సతీష్, గుడిమళ్ల కొండయ్య, గండమాల రాయప్ప తదితరులు పాల్గొన్నారు.