Telugu News

కొణిజర్ల మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

కొణిజర్ల విజయం న్యూస్

0

కొణిజర్ల మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

(కొణిజర్ల విజయం న్యూస్):-

తెరాస రాష్ట్ర నాయకులు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం కొణిజర్ల మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బొడియాతండ గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. టిఆర్ఎస్ పార్టీ యూత్ కమిటీ అధ్యక్షులు వడిత్య రంగ తమ్ముడు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. తనికెళ్ళ గ్రామంలో బాషా తిరుపతమ్మ , బోడ్డు కోటయ్య ఇటీవలే చనిపోగా వారి కుటుంబాలను పరామర్శించారు. తుమ్మలపల్లి గ్రామంలో ఇటీవలే ప్రమాదవశాత్తు చనిపోయిన పగడల దేదిత్య శహస్ర కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన చింతల మంగమ్మ ఇటీవలే యాక్సిడెంట్లో గాయపడ్డారు ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుబ్బగుర్తి గ్రామంలో మోతుకురి శివరామయ్య మాతృమూర్తి అనసూర్యమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. గద్దలగూడెం గ్రామంలో ఇటీవలే యాక్సిడెంట్లో గాయపడిన మడిగా లక్ష్మీనారాయణను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

also read :-ఖబర్దార్ గల్లా.. తప్పుడు ఆరోపణలు మానుకో

?ఈ పర్యటనలో కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, పార్టీ ప్రధాన కార్యదర్శి పరికపల్లి శ్రీను, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, కోసూరి శ్రీనివాసరావు, దొడ్డపూనేని రామారావు, రాయల పుల్లయ్య, పోట్లపల్లి శేషగిరిరావు, వింజం పిచ్చయ్య, ఏలూరి శ్రీనివాసరావు, ధారవత్ రాంబాబు, ఎంపీటీసీలు బురా ప్రసాద్, గుండ్ల కోటేశ్వరరావు, అంబెడ్కర్, సర్పంచ్లు మూడ్ సురేష్, కమాటల రేణుక, మీర్జా రోషన్ బేగ్, మండల నాయకులు చల్లగుండ్ల సురేష్, ధారవత్ బాబులాల్, సురభి వెంకటప్పయ్య, తేజావత్ మదన్, కనగంటి రావు, వడ్లమూడి లక్ష్మయ్య, గడల నరేంద్ర, బొడ్డు వీరయ్య, బండి లక్ష్మీనారాయణ, కావూరి శ్రీను, కటుకురి నరసింహారావు, షేక్ జాన్ పాషా, దేవళ్ళ వీరన్న, బోజరాజు, బండి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు