Telugu News

ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కే పట్టంకట్టారు : మాజీ ఎంపీ పొంగులేటి

- జిల్లాలోని ఖమ్మం పట్టణం, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో మాజీ ఎంపీ విస్తృత పర్యటన

0

ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కే పట్టంకట్టారు : మాజీ ఎంపీ పొంగులేటి
– జిల్లాలోని ఖమ్మం పట్టణం, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో మాజీ ఎంపీ విస్తృత పర్యటన
– పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎంపీ, మువ్వా, దయానంద్
– వధూవరులకు నూతన వస్త్రాల బహుకరణ
– కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, ఆర్ధిక సహాయం

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కే పట్టం కట్టారని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, అభ్యర్థులను నిలబెట్టి అయోమయానికి గురిచేయాలని చూసినా టీఆర్ఎస్ సర్కారుతోనే ప్రజలకు మేలు జరుగుతుందని గ్రహించి, భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మరోసారి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని, 6 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం : ఖమ్మం నగర 46 వ డివిజన్ పరిధిలోని జూబ్లిపురా ఏరియా లో ఇటీవల మరణించిన చిన్న మారయ్య చిత్రపటానికి ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుమారుడు ఎమ్మె రామకృష్ణను పరామర్శించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, బాణాల లక్ష్మణ్, ఇమామ్ భాయ్, చింతమల్ల గురుమూర్తి, బండ రవి ,మాటేటి రవి, మాలిగ హరికృష్ణ, యువనేత గోపి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

తల్లాడ : నారాయణపురం గ్రామంలో వాకదాని లక్ష్మయ్య మనుమరాలు ఓణీల అలంకరణ మహోత్సవంలో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానం లు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. వేమిరెడ్డి వెంకట నారాయణరెడ్డి ఇటీవల మరణించినందున ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట మాజీ జడ్ పీటీసీ మూకర ప్రసాద్, గొడుగునూరి లక్ష్మీరెడ్డి, పొట్టేటి బ్రహ్మారెడ్డి, కామిరెడ్డి బ్రహ్మారెడ్డి, వేమిరెడ్డి నర్సిరెడ్డి, వేమిరెడ్డి సత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లి : ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు,
జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానందు గురువారం సత్తుపల్లి మండలంలో పర్యటించారు. పట్టణ కేంద్రంలోని ఎంఆర్ గార్డెన్స్ లో టీఆర్ఎస్ నాయకులు గడిపర్తి శ్రీనివాసరావు కుమారుని వివాహ నిశ్చితార్ధ కార్యక్రమంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం పట్టణ కేంద్రం, రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి, తాళ్లమడ, గంగారం, పాకలగూడెం గ్రామాల్లో పర్యటించి పలు శుభకార్యాలలో పాల్గొనడంతో పాటు ఇటీవల మరణంచిన, గాయపడిన, అనారోగ్యానికి గురైన పలు కుటుంబాలను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. పర్యటనలో భాగంగా పలు కుటుంబాలకు ఆర్ధిక సహాయంను అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు కర్లపూడి రామారావు, దొడ్డా శ్రీను, సుబ్బారెడ్డి, జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ వరపు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వర రావు, దేవరపల్లి సాంబయ్య, బొందలపాటి శ్రీనివాస్ రావు, తోట నాగరాజు, రంగు యేసు రామాచారి, చల్లగొల్ల లోకేశ్వర్ రావు,కిష్టాపురం భాను, దేశిరెడ్డి దామోదర్ రెడ్డి, రేజర్ల వైస్ ప్రెసిడెంట్ భీమిరెడ్డి అరుణ, కాసర్ల రాంబాబు,సత్తుపల్లి పట్టణ ప్రముఖులు మందపాటి మూత్తా రెడ్డి, తోట గణేష్, టెక్స్మో కృష్ణ రెడ్డి, కౌన్సిలర్ గ్రాండ్ మౌలాలి, ఇమ్మినేని ప్రసాద్ రావు, మానస నాని, కమల్ పాషా, పల్లె రామకృష్ణ, వంగరి రాకేష్, మల్లూరి దిలీప్, దొడ్డా శ్రీనివాస్ రెడ్డి, రహీమ్, కొండపల్లి మహేష్, అజయ్, ప్రకాష్, భరత్, టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

also read :-టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం పరిశీలన.