నాలుగేళ్లలో నలుదిక్కుల అభివృద్ది: మంత్రి పువ్వాడ
== సీఎం కేసీఆర్ దయవల్లనే ప్రజలకు సేవ చేశా
== ఇంటింటికి కళ్యాణలక్ష్మి నన్ను సంతృప్తి చేసింది
== మున్నేరుకు ఆర్ సిసి రక్షణ గోడ
== 4వేల కోట్లతో ఖమ్మం నియోజకవర్గ అభివృద్ది
== అసెంబ్లీలో ఖమ్మం పోటోలు చూపిస్తుంటే సంతోషమేసింది
== ఖమ్మం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది.. ఇంకా చేయాల్సి ఉంది
== తట్టెడు మట్టి పోయనోళ్ల గురించి మాట్లాడటం ఇష్టం లేదు
== నాలుగేళ్లు మంత్రిగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది
== మీడియా చిట్ చాట్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రాష్ట్ర మంత్రిగా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని, ఆయన ఇచ్చిన అవకాశంతో నాలుగేళ్లలో ఖమ్మం నలుదిక్కులను అద్భుతంగా అభివృద్ది చేశానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నివాసంలో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించిన ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్లు మంత్రిగా పనిచేసే అవకాశం నాకు దక్కిందని,అందుకు సీఎం కేసీఆర్ కు , ఐటీ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటానని అన్నారు. ఖమ్మం మున్నేరుకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం కు ముందడుగు పడిందన్నారు. ఎనిమిది కిలోమీటర్లు మేర మున్నేరుకు పక్కన గోడ డ్రైనేజ్ కోసం 690కోట్లతో జరుగుతుందని తెలిపారు. మున్నేరు వరద వచ్చిన క్యాబినెట్ మీటింగ్ మున్నేరు సమస్యను తెలపగా మున్నేరు ప్లడ్ కు శాశ్వత పరిష్కారం చూపేలా నిధులు ఇవ్వడం శుభ సూచకమని అన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఇళ్లకు కాకుండా సిసివాల్ రివర్ బెడ్ ఏర్పాటు అవుతుంది. ఇప్పటికే ప్లాన్ పూర్తయిందన్నారు. 33 అడుగులు పైన ఆర్ సిసి రక్షణ గోడ ఉంటుందని తెలిపారు. మూడు చెక్ డ్యామ్ లు రూ.30కోట్లతో నిర్మాణం ఉంటుందని, మున్నేరులో వాటర్ ఫ్లో ఉన్నప్పుడు బోటింగ్ పెట్టుకునేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కు ప్రణాళిక సిద్ధమైందని, అతిత్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రూ.1000 కోట్ల నిధులు వరద ఖమ్మంకు పారుతుందని, నాలుగేళ్ళ మంత్రి గా ఉన్న సమయంలో నాకు వెన్నుదన్నుగా ఉండి వేల కోట్ల నిధులు ఇచ్చిన కేసీఆర్ కి రుణపడి ఉంటానని అన్నారు.
ఇది కూడా చదవండి:- అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?
నాలుగేళ్ళ కాలంలో రూ.2000 వేల కోట్లు నిధులు ఖమ్మం అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. ఖమ్మం ప్రజల రుణం ఎన్నడూ తీర్చుకోలేనిదని, తొమ్మిదిన్నర సవంత్సరాలుగా అండగా ఉంటున్న మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
== ఈనెల 14న ఖమ్మం హరీష్ రావు
ఖమ్మంలో నూతనంగా నిర్మాణం చేసిన మెడికల్ కళాశాల క్లాస్ లు ప్రారంభానికి, భవనం ప్రారంభించేందుకు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సెప్టెంబర్ 14న ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ని ప్రారంభించిన అనంతరం మమత ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఖమ్మం ప్రజలు,సీఎం కేసీఆర్,కేటీఆర్ ది రుణం ఎన్నడూ తీర్చుకోలేనిదన్నారు. త్వరలో ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన కూడా ఉంటదన్నారు. కేసీఆర్ ,కేటీఆర్ ఖమ్మంను. అభివృద్ధిలో ఆదర్శంగా తీసుకోమని చెప్పడం నా జీవితంలో సంతృప్తినిచ్చిందన్నారు. కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకాలు అడబిడ్డల ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వ ఫలాలు ఇవ్వడం మర్చిపోలేనిదని, వారు నాతో మాట్లాడే మాటలు నన్ను కట్టిపడేశాయని, అది కూడా నాకు సంతృప్తినిచ్చిందన్నారు. 70 ఏళ్ల కాలంలో ఎవరూ చేయని అభివృద్ధి పనులు చేశానని, నా తండ్రి కూడా నేను చేసిన అభివృద్ధిని చాలా ఆనందంగా మాట్లాడుతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి:- తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..?: మంత్రి
లక్షల్లో ఉన్న భూములు రేట్లు పెరిగాయంటే కారణం అభివృద్ధి జరగడమేనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మహనీయుడి విగ్రహ నిర్మాణంను కూడా కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలి అని చూశారని, ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణం విషయంలో శిఖండి రాజకీయాలు చేసినా తానా కమిటీ వాళ్ళు ఎదుర్కొని పనులు చేస్తున్నారని, అన్ని అవాంతరాలను ఎదుర్కొని నిర్మాణ చేపడుతున్న ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణం కమిటీ వారికి నా సెల్యూట్ అని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు కమిటీ వారు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు.
==తట్టెడు మట్టి పోయనోళ్ల గురించి మాట్లాడటమే వేస్ట్
ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసినోళ్లు ఇప్పుడు రాజకీయాల గురించి అభివద్ది గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నసమయంలో తట్టెడు మట్టి కూడా పోయలేదని, ఒక్కటంటే ఒక్క శిలాపలకం లేదని, వారు ఖమ్మానికి చేసింది గుండు సున్నా మాత్రమేనని ఆరోపించారు.
ఇది కూడా చదవండి:- ఇక్కడే పుట్టా..ఇక్కడే పెరిగా: మంత్రి
అభివద్ది అంటే ఏంటో తెలవనోళ్లు మాట్లాడుతుంటే, వారి గురించి మనం మాట్లాడుకోవడం వేస్టేనని అన్నారు. ఎవరు ఖమ్మంను అభివద్ది చేశారో ప్రజలకు తెలుసని, ప్రజల మద్దతు నాకు బలంగా ఉందని, కచ్చితంగా నేను మూడవ సారి విజయం సాధించడం ఖాయమన్నారు. మరో సారి గెలిస్తే , నాల్గొవ సారి గెలిచిన ఏం పనులు ఉండవన్నారు. మూడవ సారి గెలిస్తే అభివద్ది చేయడానికి ఇంకేమి మిగలదని, అంతా మూడవ సారి గెలిసిన సమయంలోనే ప్రజల సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని హామినిచ్చారు. ఈ విలేకర్ల సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరకమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు హాజరైయ్యారు.