Telugu News

మంచినీళ్లు డ్రైనేజీ పాలు

-నెల రోజులుగా నీటి కోసం పాట్లు -స్పందించిన కార్పోరేటర్ సమస్య పరిష్కారం.

0

మంచినీళ్లు డ్రైనేజీ పాలు
-నెల రోజులుగా నీటి కోసం పాట్లు
-స్పందించిన కార్పోరేటర్ సమస్య పరిష్కారం.

(ఉప్పల్ – విజయం న్యూస్) :-

ప్రజలకు అత్యవసరమైన మంచినీళ్లు నెలరోజులుగా డ్రైనేజీ పాలు అవుతున్నాయి.

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ బ్లాక్-1 లో మంచి నీటి పైప్ లైన్ పగిలిపోయి ప్రజలకు అందవలసిన మంచినీరు డ్రైనేజీ లో కలుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రజలకు అందవలసిన నీరు వృధాగా డ్రైనేజీ లో కలిసిపోవడంతో స్థానిక ప్రజలు నీటి కోసం పడరాని పాట్లు పడ్డారు.

ప్రజల సమస్య పై స్పందించిన కార్పోరేటర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఆదేశించగా హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించి మంచినీటి లీకేజీని గుర్తించి సమస్యకు పరిష్కారం చూపారు.

also read :-రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ ఆంక్షలు…

also read :-ఖమ్మం జిల్లా వాసికి పోలీస్ శాఖలో అరుదైన గౌరవం

దీంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పై స్పందించిన కార్పోరేటర్ తీరుపట్ల ప్రత్యేక తెలిపారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని కార్పొరేటర్ అన్నారు.