Telugu News

22 ఏళ్ల తరువాత కలిసిన స్నేహబంధం..

మాదాపురం ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వం విద్యార్థుల సమ్మేళనం 

0

22 ఏళ్ల తరువాత కలిసిన స్నేహబంధం..

== మాదాపురం ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వం విద్యార్థుల సమ్మేళనం 

(ముదిగొండ -విజయం న్యూస్)

:ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్​లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇరవై రెండు ఏళ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు..ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం లోని జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు.
మాధాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇరవై రెండు ఏళ్ల తీపి జ్ఞాపకాలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 1997-2002 విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు ఇరవై రెండు ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు.

వాట్సప్ వేదికగా గత మూడు నెలల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మృతి చెందిన గురువులు, స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. పూర్వపు ఉపాధ్యాయులు, రిటైర్డ్ హెడమాస్టర్ కృష్టణమూర్తి, రమణ (పీటీ ), దయాకర్ (హిందీ ) రమణ (ఇంగ్లీష్ ) తెరాల వెంకన్న (ట్యూషన్), రామకృష్ణ (ప్రైమరి), కృష్ణరెడ్డి (మాథ్స్ ) విజయలక్ష్మి(తెలుగు )మరియు
పూర్వపు విద్యార్థులు కొత్తపల్లి కిరణ్, చల్లా జగన్నాధం, పడిశాల మధుసూదన్ రావు, కందుల మోహన్ రెడ్డి,యరబోలు శ్రీనివాస్ రెడ్డి, తంగేళ్ళ ఉపేందర్, వందనపు కిరణ్, బింగి అంబేద్కర్, కేతిరెడ్డి గీత, యరబోలు కృష్ణవేణి, కవిత, బాణాల విజయలక్ష్మి, గోపిరెడ్డి కృష్ణ కుమారి, పుష్ప, చైతన్య,వసంత లక్ష్మి, సునీత, బండారు పల్లి శ్రీనివాస్ రావు, వీరభద్రం,జానీ పాషా తరితరులు పాల్గొన్నారు