Telugu News

తుమ్మలతో దోస్తి..

సీఎం కేసీఆర్ ను కలిసిన తుమ్మల

0

తుమ్మలతో దోస్తి..

== సీఎం కేసీఆర్ ను కలిసిన తుమ్మల

== వేదికపైకి పిలిచిన సీఎం కేసీఆర్

== అప్యాయతగా పలకరించిన మంత్రి కేటీఆర్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఒకరి కష్టం..మరోకరికి ఫలితమవుతుంటే ఇదేనేమో..? మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటిలో చేరిపోయేందుకు అంతా సిద్దమైంది. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఎక్కువ మందిని పోనియకుండా ఉండే ఎత్తులో భాగమే ఈనె 18న బీఆర్ఎస్  పార్టీ అవిర్భవ వేడుకల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నుంచి వెళ్తుండటం ఫలితంగా జిల్లాలో పార్టీ దెబ్బతినోద్దనే ఆలోచనతో సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అతిదగ్గరగా తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి : ‘ఖమ్మం’ పై నేతల పోకస్

సీఎం కేసీఆర్ వియ్యంకులు, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖా కేటిఆర్ మామ పాకాల హరినాథరావు(74) ఇటీవల గుండెపోటుతో మరణించగా నేడు పెద్ద కర్మ సందర్భంగా హైదరాబాద్, జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరైయ్యారు.  మంత్రి కేటిఆర్ ని పరామర్శించిన తుమ్మల, అది గమనించిన సీఎం కేసీఆర్ వేదిక ఫైకి తుమ్మలను ఆహ్వనించారు. హరినాథ రావు,  కుమారులను పరిచయం చేసిన ముఖ్యమంత్రి, ఆ తరువాత ఆయన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.హరినాథరావు ఆత్మ శాంతించాలని భగవంతున్ని ప్రార్థించారు.అయితే సీఎం కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ లు తుమ్మలనాగేశ్వరరావును అప్యాయత పలకరించారు. ఎన్నడు లేనంతగా చాలా రోజుల గ్యాఫ్ తరువాత తుమ్మల నాగేశ్వరరావు సీఎంతో కలవడంతో ఆయన చాలా మంచిగా రిసివ్ చేసుకున్నారు.

== బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించడం సంతోషం: తుమ్మల

బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఖమ్మం నగరంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గం మద్యలోని కూసుమంచి లోని అర్వపల్లి జనార్థన్ గౌడ్ నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 18 న ఖమ్మం లో జరిగే సభను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి ఊహించని షాక్..?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లో జరగని అభివృద్ధిని పాలేరు లో చేసి చూపించానని అన్నారు. తాత్కాలిక ఆనందాల కోసం ప్రజలను మభ్య పెట్టి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. శాశ్వత ప్రాతిపదికన జరిగే పనులకే నేను ఇష్టపడతా అని అన్నారు. ప్రజల కష్టాలు కాదు నాకు కావలసింది వారి ఆనందమని తెలిపారు. రహదారులు,సాగునీరు రావడంతో భూముల ధరలు పెరిగాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అభివద్ది చేశానని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం,  దేవుడు ఇచ్చిన శక్తి మేరకు అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించనానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, మాజీ ఎంపీపీ యడవల్లి ముత్తయ్య, రాజారావు, బారీ వీరభద్రం, బొళ్లం సుధాకర్ రెడ్డి, విష్ణు,  తదితరులు హాజరైయ్యారు.