Telugu News

ఇక నుంచి  ‘ఇది నా అడ్డా..’

నేను మీ బిడ్డను..రాజన్న బిడ్డను

0

ఇక నుంచి  ‘ఇది నా అడ్డా..’

== నేను మీ బిడ్డను..రాజన్న బిడ్డను

== పాలేరు మట్టి మీద ఓట్టు..

== ప్రభుత్వ ఏర్పాటు పాలేరు నుంచే స్టాట్

== నిత్యం మీతోనే ఉంటా.. మీ కోసం కోట్లాడుతా..

== రాజన్న రాజ్య స్థాపన కోసం విరామం లేకుండా పనిచేస్తా

== పేద ప్రజల ప్రభుత్వం రావాలంటే రాజన్న రాజ్యం రావాలి

== పేద ప్రజల బతుకులు మారాలంటే రాజన్న రాజ్యం రావాలి

== ఇక మీ బిడ్డని..అండగా ఉంటూ ఆశీర్వదించండి

== సంచలన ప్రకటన చేసిన వైఎస్ షర్మిళ

== ఉదయించే సూర్యుడు షర్మిళ..అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమే: విజయమ్మ

== ఖమ్మం రూరల్ మండలంలో క్యాంఫ్ కార్యాలయంకు భూమిపూజ చేసిన వైఎస్ షర్మిళ, విజయమ్మ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నేను మీ బిడ్డను.. రాజన్న బిడ్డను.. మీ అందరి అభిమాన నాయకుడి బిడ్డను.. ఇక నుంచి ఇది నా అడ్డా… పాలేరు గడ్డా.. పాలేరు మట్టి మీద ఒట్టేసి చెబుతున్నా.. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు పాలేరు నుంచే నాంధి పలుకుతున్నాం.. ఈ రోజు చేసిన భూమి పూజ.. ప్రభుత్వ ఏర్పాటుకు చేసే పూజ.. మీ అందరి అశీస్సులు నన్ను ప్రభుత్వాన్ని అందిస్తాయి.. రాబోయేది రాజన్న రాజ్యమే.. మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి..హక్కున చేర్చుకోండి.. అద్భుత విజయాన్ని అందించి అసెంబ్లీకి పంపిస్తే.. పాలేరు గడ్డ బిడ్డ ప్రభుత్వాన్ని నడిపించే నాయకురాలు కావాలి.. అందుకే మీ బిడ్డను ఆశీర్వదించండి..అంటూ వైఎస్ షర్మిళ ఉద్వేగభరిత ప్రసంగంతో అదరగొట్టారు.                                       allso read- షర్మిల టీమ్ కు ఏమైంది   

 ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, కరుణగిరి సమీపంలో వైఎస్ షర్మిళ నివాస గ్రుహంతో పాటు క్యాంఫ్ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, వైఎస్ షర్మిళ, వైఎస్ విజయమ్మ ప్రత్యేక ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన షర్మిళమ్మ, వైఎస్ విజయమ్మకు పాలేరు వద్ద పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఖమ్మంరూరల్ మండలం కరుణగిరి వద్దకు చేరుకున్న షర్మిళ, విజయమ్మలకు పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం నేరుగా పూజ కార్యక్రమానికి వచ్చిన షర్మిళ, విజయమ్మలు పూజలో పాల్గొన్నారు. అనంతరం సర్వమతప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిళ మాట్లాడుతూ వైఎస్ఆర్ పరిపాలన ఎంత అద్భుతంగా సాగిందో మీ అందరికి తెలుసని అన్నారు. వైఎస్ఆర్ పరిపాలన చేసింది కేవలం ఆరేళ్లు మాత్రమేనని, ఆ ఆరేళ్ల పరిపాలనలో ఎన్నో ప్రజాప్రయోజన పథకాలను, సామాన్యులకు కార్పోరేట్ వైద్యమందించే పథకాలను, ప్రతి పేదవారికి పక్కా ఇండ్లను నిర్మించే ఇందిరమ్మఇళ్లను, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో అందరికి సమానమైన కార్పోరేట్ ఆసుపత్రుల్ల సమాన వైద్యసేవలను అందించే పతకాలను ప్రవేశపెట్టిన నాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి. ప్రస్తుతం వైద్యం ప్రజలకు అందుబాటులో లేదని, కరోనా వస్తే లక్షల్లో ప్రజలు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

allso read- ఆరుగురు సజీవదాహనం

ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల్లో వైద్యులు సక్రమంగా వైద్యం అందించలేకపోతున్నారని ఆరోపించారు. పక్కా ఇండ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో, పాలేరు నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారో ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతుల అప్పులన్ని మాఫీ చేస్తే, 8ఏళ్లుగా ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా.? అని ప్రశ్నంచారు. నిరుపేద పిల్లలు పై చదువులు చదువుకోలేకపోతున్నారని, ప్రతి ఒక్కరు పై చదువులు చదువుకోవాలనే ఆలోచనతో ఫీజ్ రియంబర్స్ మెంట్ పథకాన్ని ఏర్పాటు చేస్తే ఆ పథకం ద్వారా వేలాధి మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలను పొందేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కల్పించారని అన్నారు. మరీ గొప్పలు చెప్పే మాయల మారాఠి ప్రభుత్వం ఏ ఒక్క విద్యార్థికైనా ఫీజ్ రియంబర్స్ మెంట్ పెట్టారా..? అని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్ పథకం ద్వారా పాలేరు నియోకజవర్గంలోని అన్ని గ్రామాలకు కాలువలు తవ్వించింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. రూపాయ కిలో బియ్యంతో పాటు 9 రకాల సరుకులను వైఎస్ఆర్ ప్రభుత్వం ఇస్తే, ఒక్క బియ్యం తప్ప మరే సరుకులు రాకుండా చేసిన ప్రభుత్వం సీఎం కీసీఆర్ ప్రభుత్వమని విమ్మర్శించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో స్వపరిపాలన రావాలంటే, రాజన్న రాజ్యం రావాల్సిందేనని అన్నారు. రాజన్న రాజ్యంలోనే నిరుపేదలకు లాభం చేకూరుతుందన్నారు. అందుకే అక్కళ్లారా..? అన్నళ్లారా..? అవ్వళ్లారా,,తాతళ్లారా..? మనబతుకులు మారాలంటే రాజన్న రాజ్యం రావాలి. మన జీవితాల్లో వెలుగు రావాలంటే రాజన్న రాజ్యం రావాలి. మన బిడ్డలకు చదువులు రావాలంటే, ఉద్యోగం పొందాలంటే రాజన్న రాజ్యం రావాలి. ఆ రాజన్న రాజ్యం రావడం కోసం, తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు ఖమ్మం జిల్లా కేంద్రంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును ప్రకటించడం జరిగిందని అన్నారు. ఆనాడు చూపిన అభిమానం, నేటికి మర్చిపోలేనిది అని అన్నారు.

== ఇక నుంచి ఇది నా అడ్డా..                                allso read- ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ

పాలేరు నియోజకవర్గం నా కన్నతల్లిలాంటిది.. ఈ నేను మీ అందరి బిడ్డను.. చిన్నవాళ్లకు అక్కను, పెద్దవాళ్లకు చెల్లెను, బాబాయ్, పెదనాన్నలకు బిడ్డను.. అవ్వలు, తాతలకు మనమరాలున.. నేను మీ బిడ్డను.. ఇక నుంచి ఇది నా అడ్డా అంటూ వైఎస్ షర్మిళ గాంభీరంగా చెప్పారు. పాలేరు నియోజకవర్గ ప్రజలందరికి చెబుతున్నా.. పాలేరు మట్టి మీద ఒట్టేసి చెబుతున్నా..? రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మాటిస్తున్నా..? ఇక నుంచి మీతోనే ఉంటా..? మీ కోసం కోట్లాడుతా.. రాజన్న రాజ్య స్థాపన కోసం విరామం లేకుండా పనిచేస్తా.. పేద ప్రజల ప్రభుత్వం రావాలంటే రాజన్న రాజ్యం రావాలి.. పేద ప్రజల బతుకులు మారాలంటే రాజన్న రాజ్యం రావాలంటే మీ పరిపాలన రావాలి అని అన్నారు.  ఇక మీ బిడ్డని..అండగా ఉంటూ ఆశీర్వదించండి అంటూ ప్రజలను కోరారు. పాలేరు నియోజకవర్గం నుంచే ప్రభుత్వ పరిపాలనకు నాంధి పలికిందని, వైఎస్ఆర్ టీపీ ప్రభుత్వంలోకి వచ్చేందేకు నాంధి పలుకుతున్నామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా పరిపాలనను అందించడమే లక్ష్యంగా, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని హామినిచ్చారు. ప్రజల కోసం పోరాటం చేస్తానని, ప్రజల కోసం నిత్యం శ్రమజీవినై పనిచేస్తానని హామినిచ్చారు. ప్రజలందరు అండగా ఉండాలని, హక్కున చేర్చుకోవాలని కోరారు.

== వైఎస్ఆర్ టీపీ అంటే సీఎం కేసీఆర్ భయమే

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే సీఎం కేసీఆర్ భయమేనని వైఎస్ షర్మిళ ఆరోపించారు. భయముంది కాబట్టే వైఎస్ షర్మిళ పర్యటనను అడుగడుగున అడ్డుపడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మహిళలనైన నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

allso read- కోమటిరెడ్డి లేకుండానే..? అందులో నోచాన్స్

పాదయాత్ర చేస్తూ ప్రజలను ఐక్యం చేసేందుకు నేను ప్రజాస్వామ్య బద్దంగా పాదయాత్ర చేస్తుంటూ ఎక్కడ షర్మిళకు మంచిపేరు వస్తుందేమోనని అడుగడుగున పాదయాత్రను పోలీసుల ద్వారా అడ్డుకోవడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతుందన్నారు. మహిళ, ఓ పార్టీకి అధ్యక్షురాలననే ఇంగిత జ్జానం లేకుండా కారులో ఉండగానే క్రేన్ తో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ఎక్కడైనా చూశారా..? సీఎం కేసీఆర్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అని ప్రశ్నించారు. ప్రజల్లో వైఎస్ఆర్ టీపీకి వచ్చే ఆదరణను చూసిన సీఎం కేసీఆర్ ఎక్కడ షర్మిళ ముందుపడుతుందేమోనని భయంతో పాదయాత్రకు అడ్డు పడుతున్నారని అన్నారు. అయితే న్యాయవ్యవస్థపై నమ్మకుమున్న మాకు పాదయాత్రపై కోర్టుకు వెళ్లి ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిదని,పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆదేశించిందన్నారు. కేసులకు, జైళ్లకు, బెదిరింపులకు, అడ్డంకులకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా భయపడేది లేదని, ప్రజలు కూడా ఎవరు అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నాలకు, కేసులకు భయపడేది లేదన్నారు.

== నా బిడ్డ ఏం అన్యాయం చేసింది : విజయమ్మ

వైఎస్ షర్మిళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంటే అడుగడుగున అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వం కార్యకర్తలను, నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని షర్మిళ ఆరోపించారు. లాఠీచార్జీ చేశారు, అడ్డుకున్నారు, నెట్టేశారు, జైలుకు పంపించాలని బయపెడుతున్నారని అన్నారు. నా బిడ్డ ఏం పాపం చేసిందని ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు పడుతున్నారని అన్నారు.  కేసులు, జైలు మాకు కొత్తేమి కాదని,  ప్రజల కోసం ఎన్ని రోజులైన కేసులకు వెళ్తామని అన్నారు. కేసులు పెట్టించి జైళ్లకు పోయిన పార్టీలు ఇప్పుడు ఎక్కడున్నాయో ప్రజలందరికి తెలుసని అన్నారు. షర్మిళ కు కష్టపడి పనిచేసే తత్వం ఉంది. రాజశేఖర్ రెడ్డి రక్తంతో పుట్టిన బిడ్డ ఆమె.. మాట ఇవ్వడమే కానీ తప్పడం లేదని అన్నారు. షర్మిళను ప్రజలందరు దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ చార్జ్ పిట్టా రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుదీర్, నాయకులు కెకెడి, క్రిష్ణమోహన్ తదితరులు హాజరైయ్యారు.