Telugu News

నేరవేరుతున్న రైతన్న కల

మార్కెట్ కోసం ఏన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రైతులు

0

నేరవేరుతున్న రైతన్న కల

== మార్కెట్ కోసం ఏన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రైతులు

== ఖమ్మం మార్కెట్ దళారుల పాలు..?

== ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న గ్రామీణ రైతులు

== పట్టుబట్టి మార్కెట్ ను మంజూరు చేయించిన మాజీ మంత్రి

== అనేక ప్రభుత్వ స్థలాలు పరిశీలన

== చివరికి మద్దులపల్లికి చేరిన మార్కెట్ యార్డ్

== రూ.15కోట్ల నిధులు విడుదల

==రేపు మద్దులపల్లిలో మార్కెట్ యార్డ్ కు శంకుస్థాపన చేయనున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
ఎన్నో ఏళ్ల కల.. రైతుల కన్నీళ్ల నుంచి రాలువారిన వేగుచుక్క ఈ కల.. అనేక ఇబ్బందుల బంధం నుంచి బయటపడేందుకు రైతన్న ఏళ్ల తరబడి ఎదురుచూసిన వేళ.. నేడు సుభసమయసుముహుర్తానా అది నిజం కాబోతుంది.. కల నేరవేరబోతుంది.. పాలేరు నియోజకవర్గ రైతన్నల నాడిపట్టిన నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాటిన మొక్క..నేడు మానైతున్నది.. నీడనిచ్చే గూడైతున్నది.. రైతన్నకు బురువెక్కిన గుండె కన్నీరు జారువాలుతున్నది.. మనసు పులకింతవుతున్నది.. ఖమ్మం మార్కెట్ యార్డులో కన్నీల్లు గార్చిన రైతన్న గోస తీరేందుకుసంసిద్దమవుతున్నది.. రైతన్న ముఖంలో ఆనందం వెల్లువిరవబోతున్నది.. అదే పాలేరు నియోజకవర్గ రైతుల ఆశ..ఘోస.. శ్వాస.. మార్కెట్ యార్డ్.. ఖమ్మం నగరంలో ఉన్న మార్కెట్ యార్డ్ తో అనేక ఇబ్బందులు పడిన పాలేరు నియోజకవర్గ రైతన్నకు దారి చూపిన బాటసారి తుమ్మల నాగేశ్వరరావు.. ఆయన వేసిన మొక్క నేడు నీడనిచ్చేందుకు ఎదుగుతున్నది.. మార్కెట్ యార్డు కావాలని, అందుబాటులో ఉండాలని రైతన్నలు నాటి మంత్రికి వినతి చేసిన తరుణంలో కంకణబద్దులై కదనరంగంలో దిగిన పాలకులు పట్టువీడక పారిపోయిన పైసలను పట్టుకొచ్చి మరి పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసిండ్రు.. ఫలితంగా రైతన్నల కల సాకారానికి శ్రీకారం చుట్టిండ్రూ. మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నిర్మాణంపై ‘విజయం’ తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం..

also read :-అలయ్…బలయ్..సంబురంగా రంజాన్ వేడుకలు

ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలో అతిపెద్ద వ్యవసాయమార్కెట్ ఉంది. ఆ మార్కెట్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహుబూబాబాద్, సూర్యపేట జిల్లా నలుమూలల నుంచి, అటు పక్క తెలుగు రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజకవర్గ తదితర ప్రాంతాల నుంచి మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు అధికంగా వచ్చేది.. ముఖ్యంగా పత్తి, మిర్చి పంట అత్యధికంగా సాగు అవుతున్న ఈ మూడు జిల్లాల నుంచి భారీగా ఖమ్మం వ్యవసాయమార్కెట్ కు రైతులు తమ పంటతో తరలివచ్చేవారు. ప్రతి సీజన్ సమయంలో మార్కెట్ యార్డ్ నిండిపోయి నడిరోడ్లపై బస్తాలను ఏర్పాటు చేసి రోజుల తరబడి కాపాల కాచుకునేవారు రైతన్నలు.. మార్కెట్ కు పత్తి, మిర్చి, మొక్కజొన్నలు, పెసర లాంటి పంటలు భారీగా తరలివస్తుండటంతో కొనుగోలు చేసేవారు కూడా భయపడేవారు. దీంతో పాటు దళారులు పెత్తనం అధికంగా ఉండేది. భారీగా పంట మార్కెట్ కు వచ్చిందంటే దళారుల రాజ్యం నడిస్తుంటుంది..

also read :-ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే

వాళ్లందరు మూకుమ్మడిగా సమావేశమై ధరలు తగ్గించి నిలువుదోపిడి చేసే పరిస్థితి ఉంటుంది.. మబ్బులు వాళ్లకు ఆధాయ వనరులు.. వీస్తున్న ఈదురు గాలులు రైతుల కాపురాలకు నిప్పులు అవుతుంటే, ఉరుములు రైతుల గుండెల్లో రైళ్లు అవుతుంటే, దళారులు ఇదే అసరగా తీసుకుని రైతన్నల గుండెలపై బరువెక్కిన మాటలతో పంట ధరలను డమిల్ అని పడేసేవారు.. వీస్తున్న గాలులు, ఉరుములు రైతులకు శాపంగా మారితే.. దళారులకు వరంగా మారుతున్న పరిస్థితి ఖమ్మం మార్కెట్ యార్డ్ లో ఉంది. ఎంతో మంది రైతులు నిలువన నష్టానికి అమ్ముకున్న పరిస్థితులు అనేకంగానే ఉన్నాయి.. అంతే కాదు.. ధర పడటం లేదని నాలుగు రోజులు మార్కెట్ లో ఉంచిన పాపానికి అకాలంగా కురిసిన వర్షానికి పంటంతా నీటిపాలైన దుస్థితి అనేక సార్లు మనం చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి తరుణంలో మార్కెట్ యార్డ్ తరలింపు అంశం బయటకు వచ్చింది.. మార్కెట్ యార్డ్ తరలింపు రాజకీయమైంది.. ఈ రాజకీయ రణరంగంలో రైతన్నలు బలిపశువులైయ్యారు.. బేడీలతో జైలుబాట పట్టించిన చరిత్ర ఖమ్మం మార్కెట్ కే దక్కింది.. ఇలాంటి తరుణంలో గత మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆలోచించి పాలేరు రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో నూతన మార్కెట్ యార్డ్ ను నిర్మాణం చేయాలని భావించారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్, మంత్రి హారీష్ రావుకు తన ఆలోచన విధానాన్ని వివరించిన సందర్భంలో వారిద్దరు మార్కెట్ యార్డ్ నిర్మాణానికి అంగీకరించారు. దీంతో సీఎం కేసీఆర్ 2017 సంవత్సరంలో పాలేరు నియోజకవర్గానికి మరో మార్కెట్ యార్డ్ ను మంజూరు చేశారు.

also read;-అప్యాయతగా పలకిరిస్తూ.. అలయ్ బలయ్ చేస్తూ

కాగా ఈ మార్కెట్ యార్డ్ కోసం స్థలాన్ని సేకరించే పనిలో నిమగ్నమైన అధికారులు పలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మద్దులపల్లి గ్రామంలోని ఎన్ఎస్ పీ కాలువ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 27.10 ఎకరాల స్థలంలో మార్కెట్ యార్డ్ ను నిర్మాణం చేసేందుకు అంగీకరించారు. దీంతో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ గా నామకరణం చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సీఎం కేసీఆర్ తో చెప్పి రూ.15కోట్ల నిధులు మంజూరు చేయించారు. అనంతరం మార్కెట్ యార్డ్ కు పాలకమండలిని కూడా ఎంపిక చేసేందుకు సన్నహాలు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రక్రీయను ఏర్పాటు చేయగా, తొలి రిజర్వేషన్ గా బీసీకి రావడం జరిగింది. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల పాలకకమిటీని ఏర్పాటు చేయలేకపోయారు. అనంతరం 2018 డిసెంబర్ లో సీఎం కేసీఆర్ పాలకమండలిని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో మద్దులపల్లి మార్కెట్ నిర్మాణం నిలిచిపోయింది.

== ఏళ్లు గడిచిన ముందుకు కదలని మార్కెట్ నిర్మాణం

2018 ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడం, కాంగ్రెస్ పార్టీ నుంచి కందాళ ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. రాజకీయ మార్పుల్లో భాగంగా కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరగా, మార్కెట్ యార్డ్ పనుల పై ఆయన ద్రుష్టి సారించలేకపోయారు. రాజకీయాల్లో కొత్త కావడం, ఎమ్మెల్యేగా మొదటి సారి విజయం సాధించడంతో ఆయన స్థిరంగా నిలబడేందుకు కొంత సమయం అవసరమైంది. ఈ క్రమంలో గతేడాది మద్దులపల్లి మార్కెట్ కమిటీకి కందాళ ఉపేందర్ రెడ్డి నూతన కమిటీని ప్రకటించారు. జనరల్ రిజర్వేషన్ రావడంతో కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామానికి చెందిన మల్లీడీ అరుణను చైర్మన్ గా ప్రకటించారు. 13మందితో కూడిన కమిటీని నియమించారు. అయితే మార్కెట్ లేకుండా కార్యాలయం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్ కమిటీపై అధికారులపై అనేక ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ లేకుండా పాలకమండలి ప్రకటించడం, నిధులు ఖర్చు చేయడం, అధికారులను నియమించడంపై అనేక విమ్మర్శలు వచ్చాయి.అంతే కాదు మీడియాలో కూడా అనేక కథనాలు ప్రచురితమైయ్యాయి.

== నిధులు రాబట్టిన ఎమ్మెల్యే కందాళ

మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయకుండానే నిధుల ఖర్చు విషయంపై ఆరోపణలు వస్తున్న తరుణంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సిరియస్ అయ్యారు. మార్కెట్ అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించి నిధులు, మార్కెట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిధులు వెనక్కి వెళ్లిపోయినట్లు అధికారులు చెప్పగా, వాటి సంగతి నేను చూసుకుంటానని, మార్కెట్ నిర్మాణానికి సిద్దం కావాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఏం చేశారో ఏమో కానీ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నిర్మాణానికి నిధులను రప్పించి పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. కాగా అతికొద్ది నెలల్లోనే మార్కెట్ యార్డ్ లోని రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మార్కెట్ నిర్మాణ పనులకు ఇద్దరు మంత్రులతో శంకుస్థాపన చేయిస్తున్నారు. దీంతో పాలేరు నియోజకవర్గ రైతుల కల నేరవేరినట్లైంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రైతుల కల సాకారమవనుంది.

== నేడు ఇద్దరు మంత్రులతో శంకుస్థాపన

ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు బుధవారం శంకుస్తాపన చేయనున్నారు. అలాగే ఖమ్మం ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతామధుసూదన్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం హాజరై శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేయగా ఈ సభలో ప్రభుత్వం చేస్తున్న రైతు అభివద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు.

== పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ

మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం బుదవారం నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చైర్మన్ మల్లీడీ అరుణ, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా ఆధ్వర్యంలో శంకుస్థాపనకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ పనులను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ మంగళవారం పరిశీలించారు. శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని, సభా వేదికను పరిశీలించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న సందర్భంలో రైతులకు, ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను, పాలక సభ్యులను ఎమ్మెల్యే ఆదేశించారు. మొత్తానికి మద్దులపల్లి లో మార్కెట్ యార్డు రావడం పట్ల రైతులందరు సంతోషంగా ఉన్నారనేది నగ్న సత్యం అయితే. ఖమ్మం మార్కెట్ యార్డ్ తరహాలో దళారులను ప్రోత్సహించకుండా, రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రైతులు కోరతున్నారు.